Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్‌స్కీ ఆగ్రహం
Donald Trump | రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించే అమెరికా.. చివరికి దిగిరాక తప్పలేదు. తన అవసరాల కోసం రష్యా డీజిల్‌పై (Diesel) ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladimir Putin) ఒప్పందం చేసుకున్నారు.
International | Published On Oct 10, 2026, 8.32 am IST
Donald Trump | త్రినేత్ర న్యూస్: రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించే అమెరికా.. చివరికి దిగిరాక తప్పలేదు. తన అవసరాల కోసం రష్యా డీజిల్‌పై (Diesel) ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladimir Putin) ఒప్పందం చేసుకున్నారు. దేశంలో ఇంధన ధరలు భారీగా పెరగడం, మధ్యంతర ఎన్నికలు (Midterm Election) ఉండటంతో రష్యాను (Russia) ఆశ్రయించక తప్పలేదు. ఇందులో భాగంగా రష్యా డీజిల్‌పై 2027 ఏప్రిల్ వరకు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
ఒప్పందం మేరకు మూడు లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికా (America), అంతర్జాతీయ మార్కెట్లకు రష్యా తక్షణమే సరఫరా చేయనుంది. నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో 10 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. అలాగే, రష్యాలో రిఫైనరీల పరిస్థితిని బట్టి ముందు ముందు 30 లక్షల టన్నుల వరకు దిగుమతి అవుతుందని వెల్లడించారు. అమెరికాలో (America) డీజిల్ ధరలు గ్యాలన్‌కు 6.28 డాలర్లకు చేరాయి. దీంతో ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రష్యాతో ఒప్పంద చేసుకోక తప్పలేదు. కాగా, రైతులు, పశువుల పోషకులు, ట్రక్కుల డ్రైవర్లపై ఇంధన ధరల (Energy Costs) భారాన్ని తగ్గించడమే తమ ప్రాధాన్యమని ట్రంప్ చెప్పారు. అమెరికాలో ఇంధన ధరలు తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మరోవైపు రష్యా, అమెరికా ఒప్పందంపై ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు.

పుతిన్‌కు ట్రంప్ బహుమతి: జెలెన్‌స్కీ
రష్యాతో అమెరికా ఒప్పందాన్ని.. పుతిన్‌కు ట్రంప్ ఇచ్చిన బహుమతిగా (Gifts to Putin) జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy)పేర్కొన్నారు. ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుపుతూనే.. మరోవైపు రష్యాకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులు ఉక్రెయిన్‌ఫై యుద్ధాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. యుద్ధాన్ని (Russia Ukraine War)ముగించాల్సిన సమయంలో రష్యాతో అమెరికా డీజిల్ ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని మరింత సాగదీస్తున్నదని మండిపడ్డారు. ఒప్పందంలో భాగంగా రష్యాపై ఆంక్షలను అమెరికా ఎత్తివేసేలా కనబడుతున్నదని విమర్శించారు. పుతిన్‌కు బహుమతులు ఇవ్వడం వల్ల శాంతి రాదని, నాగరిక ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడ్డారు. నిజమైన శాంతి సాధించాలంటే ఇరు పక్షాలు పరస్పరం ఉద్రిక్తతలను తగ్గించుకునే చర్యలు తీసుకోవాలన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Drone Attack | నల్లసముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. సిబ్బంది అంతా భారతీయులే
అక్టోబర్ 7, 2026

Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?
అక్టోబర్ 6, 2026

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు



