త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smit Machchhar | యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు

గాల్లో విమానం.. కాక్‌పిట్‌లో ప్రాణాంతక దాడి! ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ స్మిత్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం ప్రకటించింది.

J

International | Published On Oct 4, 2026, 4.12 pm IST

Smit Machchhar | యావత్ ప్రపంచానికే నువ్వు హీరోవి : స్మిత్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రకటించిన నెతన్యాహు

సంక్షిప్త సారాంశం

ప్రాణాపాయ స్థితిలోనూ సంయమనం కోల్పోకుండా విమానాన్ని, ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా కేవలం తమ దేశ పౌరులకు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక 'సెలబ్రేటరీ ఫ్లేమ్' (స్వాతంత్య్ర జ్యోతి) గౌరవాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్మిత్‌కు ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ జ్యోతిని సంయుక్తంగా వెలిగించాల్సిందిగా స్మిత్‌ను నెతన్యాహు ఆహ్వానించారు. కాక్‌పిట్‌లో కో పైలట్ జరిపిన దాడి, ఆ సమయంలో తాను స్పందించిన తీరును నెతన్యాహుతో ఫోన్ కాల్‌లో స్వయంగా కెప్టెన్ స్మిత్ పంచుకున్నారు.

Advertisement
  • గాల్లో ప్రాణాంతక దాడి
  • భారత పైలట్ అద్భుత సాహసం
  • ప్రధాని మోదీతో కలిసి ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారానికి ఆహ్వానం

Smit Machchhar | త్రినేత్ర న్యూస్ : ఆకాశంలో వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. ఉన్నట్టుండి కాక్‌పిట్‌లోనే పైలట్‌పై ఊహించని దాడి. తీవ్ర రక్తస్రావంతో కళ్లు మసకబారుతున్నా, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు ఫ్లైదుబాయ్ భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఆయన చూపిన తెగువకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా కెప్టెన్ స్మిత్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఆయనను "భారత్, ఇజ్రాయెల్ మాత్రమే కాక యావత్ ప్రపంచానికే హీరో" అని కొనియాడారు.

ఇదీ చదవండి : Captain Smit Machchhar | భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను ఆస్పత్రిలో పరామర్శించి ప్రశంసించిన దుబాయ్ యువరాజు

అరుదైన గౌరవం.. మోదీతో కలిసి ప్రత్యేక ఆహ్వానం

సాధారణంగా ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెలిగించే ప్రతిష్టాత్మక ‘సెలబ్రేటరీ ఫ్లేమ్’ (విక్టరీ టార్చ్) గౌరవాన్ని కేవలం తమ దేశ పౌరులకు మాత్రమే ఇస్తుంటారు. అయితే, ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా కెప్టెన్ స్మిత్‌కు ఈ అత్యున్నత గౌరవాన్ని అందించాలని ప్రధాని నెతన్యాహు నిర్ణయించారు. రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ పవిత్ర జ్యోతిని సంయుక్తంగా వెలిగించాలని నెతన్యాహు ఆహ్వానించారు.

Also Read : flydubai attacker | ఉగ్ర‌వాద భావ‌జాలం.. విమానాలు న‌డ‌ప‌డంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైల‌ట్ గురించి సంచ‌ల‌న విష‌యాలు

ఆ భయానక క్షణాల్లో ఏం జరిగింది?

నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా కాక్‌పిట్‌లో జరిగిన ఆ భయానక ఘటనను కెప్టెన్ స్మిత్ వివరించారు.

"ఫ్లైట్ సాధారణంగానే మొదలైంది. ప్రార్థన చేసుకుంటానని కో-పైలట్ చెప్పడంతో, అతనిపై గౌరవంతో నేను ముందు వైపే చూస్తూ కూర్చున్నాను. ఓ నాలుగైదు నిమిషాల తర్వాత ఉన్నట్టుండి నా తల వెనుక భాగంలో ఎవరో బలంగా కొట్టారు. మొదట విమానానికి ఏదో సాంకేతిక సమస్య లేదా భారీ నష్టం జరిగిందేమో అనుకున్నాను. కానీ ఆ వెంటనే నాపై వరుస దాడులు జరిగాయి. అప్పుడు అర్థమైంది నన్ను కొడుతున్నది కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ అని." అని కెప్టెన్ స్మిత్ మచ్చర్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : Flydubai Flight | హైజాక్ కోడ్‌.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!

చివరి శ్వాస వరకూ పోరాడి..

తల వెనుక పదే పదే బలంగా కొట్టడంతో కంటిచూపు మసకబారిపోయిందని, విమానం అదుపు తప్పుతుండగా ప్రయాణికుల అరుపులు వినిపించాయని స్మిత్ చెప్పారు. "నేను కింద పడిపోయాను. ఇక ఇది నా ఆఖరి పోరాటం అనిపించింది. నేను గనుక ఇప్పుడు లేవకపోతే చనిపోవడం ఖాయం అని స్పష్టంగా అర్థమైంది. ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని అతన్ని నెట్టేసి, కాక్‌పిట్ డోర్ తెరిచాను. వెంటనే బయట వేచి చూస్తున్న ప్రజలు లోపలికి వచ్చి అతన్ని బంధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు" అని స్మిత్ వివరించారు.

Also Read : Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియ‌న్ పైల‌ట్‌పై ఇజ్రాయెల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

అసాధ్యమైన విపత్కర పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తి, తిరుగులేని మనోధైర్యాన్ని ప్రదర్శించి విమానాన్ని సురక్షితంగా నిలిపిన కెప్టెన్ స్మిత్‌ను నెతన్యాహు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయ ఘట్టంగా మిగులుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement