CM Revanth Reddy | వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం
CM Revanth Reddy | రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా, హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా, హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు.
ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్ గౌడ్, క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
సుదర్శన్ గౌడ్ భార్య విజ్ఞాపన మేరకు ఈ ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుదర్శన్ గౌడ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CEC Gyanesh Kumar Education | యూపీ బోర్డు టాపర్, ఐఐటీ నుంచి హార్వర్డ్ దాకా: వివాదాల కేంద్రంలో ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ విద్యా నేపథ్యం తెలుసా?
- ●Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్
- ●Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
- ●Rahul Gandhi vs Election Commission | 'రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్': సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. రేపే సీజేఐ బెంచ్ విచారణ
- ●Navaratri Brahmotsavam | వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం.. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనం
- ●TCS | ఏఐ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు.. 6 నెలల్లో 24 వేల నియామకాలు..

CEC Gyanesh Kumar Education | యూపీ బోర్డు టాపర్, ఐఐటీ నుంచి హార్వర్డ్ దాకా: వివాదాల కేంద్రంలో ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ విద్యా నేపథ్యం తెలుసా?

Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ

Rahul Gandhi vs Election Commission | 'రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్': సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. రేపే సీజేఐ బెంచ్ విచారణ





