త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Sanctions | ర‌ష్యాపై ఆంక్ష‌లు ఎత్తివేసిన ట్రంప్‌.. భార‌త్‌కు భారీ ఊర‌ట‌!

US Sanctions | చ‌మురు కొనుగోళ్ల విష‌యంలో భార‌త్‌కు (India) భారీ ఊర‌ట ల‌భించింది. ర‌ష్యా నుంచి ఇంధ‌నం (Russian oil) కొనుగోలు చేస్తున్న దేశాల‌పై సుంకాలు (US Sanctions) విధించే చ‌ట్టంలోని ప‌లు ఆంక్ష‌లు, సుంకాల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌క‌టించారు.

G

International | Published On Oct 17, 2026, 9.43 am IST

US Sanctions | ర‌ష్యాపై ఆంక్ష‌లు ఎత్తివేసిన ట్రంప్‌.. భార‌త్‌కు భారీ ఊర‌ట‌!
Advertisement

US Sanctions | త్రినేత్ర న్యూస్‌: చ‌మురు కొనుగోళ్ల విష‌యంలో భార‌త్‌కు (India) భారీ ఊర‌ట ల‌భించింది. ర‌ష్యా నుంచి ఇంధ‌నం (Russian oil) కొనుగోలు చేస్తున్న దేశాల‌పై సుంకాలు (US Sanctions) విధించే చ‌ట్టంలోని ప‌లు ఆంక్ష‌లు, సుంకాల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్ర‌క‌టించారు. అమెరికా ప్ర‌యోజనాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను కాంగ్రెస్ స‌మ‌ర్పించిన‌ట్లు చెప్పారు.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ర‌ష్యాకు (Russia) అందుతున్న ఆర్థిక వ‌న‌రుల‌ను త‌గ్గించాల‌నే ల‌క్ష్యంతో `లిండ్సె ఓ. గ్రాహ‌మ్ శాంక్ష‌నింగ్ ర‌ష్యా అండ్ ఇరాన్ యాక్ట్‌-2026`ను (Graham Act) అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టంపై సెప్టెంబ‌ర్ 18న ట్రంప్ సంత‌కం కూడా చేశారు. ర‌ష్యా ఇంధ‌నాన్ని అత్య‌ధికంగా దిగుమ‌తి చేసుకునే ఐదు దేశాల నుంచి అమెరికాలోకి వ‌చ్చే వ‌స్తువుల‌పై 100 శాతంలోపు ఎంతైనా సుంకాలు (Tariffs) విధించే అవ‌కాశం ఈ చ‌ట్టం ఉంది. అయితే జాతీయ ప్ర‌యోజ‌నాల పేరుతో ఈ సుంకాల అమ‌లుకు స‌రిగ్గా ఒక రోజు ముందే ట్రంప్ మిన‌హాయింపులు (Sanctions Waived) క‌ల్పిస్తూ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అమెరికాలో న‌వంబ‌ర్ 3న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. అయితే దేశంలో ప్ర‌స్తుతం డీజిల్ ధ‌ర‌లు (Diesel Price) ఆకాశ‌న్నంటుతున్నాయి. వీటిని కిందికి దించేందుకు ట్రంప్ రష్యాపై విధించిన కఠిన ఆంక్షలు, సుంకాలను ఎత్తివేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో (Vladimir Putin) జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ఫలితంగా ఆ దేశం నుంచి తక్షణమే 3 లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికా కొనుగోలు చేయనుందని ట్రంప్ వెల్లడించారు. నవంబర్, ఆ తర్వాతి నెలల్లోనూ ఈ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. రైతులు, ట్రక్ డ్రైవర్లకు ఇంధన భారాన్ని తగ్గించడమే తన తొలి ప్రాధాన్యమని, ఈ ఒప్పందంతో అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పడిపోతాయని చెప్పారు. కాగా, ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఆంక్షల భయం లేకుండా రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు మరింత స్వేచ్ఛ లభించింది.

Advertisement
Advertisement