Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి
Indian Origin Pilot | పెళ్లైన కొన్ని గంటలకే హనీమూన్‌కు వెళ్తూ.. వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ విషాధ ఘటన అమెరికా (America)లోని జార్జియా (Georgia)లో చోటు చేసుకుంది.
International | Published On Jun 1, 2026, 2.50 pm IST
Indian Origin Pilot | అమెరికాలో భారత సంతతి (Indian Origin Pilot) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన కొన్ని గంటలకే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ విషాధ ఘటన అమెరికా (America)లోని జార్జియా (Georgia)లో చోటు చేసుకుంది.
26 ఏళ్ల డేవ్ ఫిజీ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ (Delta Air Lines pilot)గా పనిచేస్తున్నాడు. అతడి ఫ్యామిలీ కొన్నేళ్ల క్రితమే కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. అయితే, గత నెల 29న డేవ్‌కు డాసన్‌విల్లేలో తన ప్రేయసి జెస్నితో వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సుమారు 500 మంది హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం 'రాబిన్సన్ R66' హెలికాప్టర్‌లో కొత్త దంపతులు అట్లాంటాలోని ఓ హోటల్‌కు హనీమూన్ కోసం బయల్దేరారు. అయితే, ఆ సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులకు వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్ సమీపంలోని కొండ ప్రాంతంలో కూలిపోయింది (helicopter crash).
ఈ ఘటనలో డేవ్‌తోపాటూ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. జెస్ని మాత్రం సుమారు ఐదు గంటల పాటూ శిథిలాల కిందే చిక్కుకుని నరకయాతన అనుభవించింది. చివరికి సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డేవ్ మృతితో జెస్ని షాక్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె అట్లాంటాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వృత్తి రీత్యా ఓ నర్సు. పదేళ్ల క్రితం ఓ చర్చిలో డేవ్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీయడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. జీవితాంతం తోడూనీడగా ఉండాలనుకున్నారు. కానీ, హెలికాప్టర్ రూపంలో వచ్చిన ప్రమాదం జెస్ని జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. ఇక డేవ్ మృతితో అతడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వివాహం తర్వాత తన కుమారుడు ఎంతో సంతోషంగా కనిపించాడని.. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందంటూ డేవ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..
జేబు దొంగలున్నారు జాగ్రత్త.. సీబీఎస్ఈపై రాహుల్ తీవ్ర విమర్శలు
టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు






