FIP | హెలికాప్టర్ ప్రమాదాలపై పైలట్ల ఆందోళన.. ప్రధాని మోదీకి లేఖ
FIP | దేశంలో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హెలికాప్టర్ ప్రమాదాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రధానికి లేఖ రాసింది.
FIP | దేశంలో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న హెలికాప్టర్ ప్రమాదాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రధానికి లేఖ రాసింది. గత కొన్నేళ్లుగా ఉత్తరాఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు పునరావృతం కావడం ఆందోళనకరమని ఎఫ్ఐపీ పేర్కొంది. ప్రస్తుత భద్రతా ప్రమాణాలు, పైలట్ల శిక్షణ, వాతావరణ అంచనాలు, హెలిప్యాడ్ల సౌకర్యాలు, ప్రమాదాల నివారణ చర్యలపై సమగ్ర సమీక్ష అవసరమని అభిప్రాయపడింది. కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరింది. చార్‌ధామ్ యాత్రలో వరుస ప్రమాదాలపై 2025 ఆగస్టులో పార్లమెంటరీ కమిటీ తన 380వ నివేదికలో హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది.
ఇంజిన్ ఫెయిలైతే తప్పించుకోవడం కష్టమే!
కేదార్‌నాథ్ ప్రాంతం ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయలతో కూడి ఉంటుందని ఎఫ్ఐపీ వివరించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ఇది అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండే ప్రాంతమని తెలిపింది. ఇలాంటి చోట హెలికాప్టర్ ఇంజిన్ పనిచేయడం ఆగిపోతే సురక్షితంగా కిందకు దించడం దాదాపు అసాధ్యమని పేర్కొంది. అంతేకాకుండా అక్కడి చాలా హెలిప్యాడ్లలో ఒకే దిశలో టేకాఫ్, ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. దీంతో గాలికి ఎదురుగా కాకుండా గాలి వీచే దిశలోనే టేకాఫ్ చేయాల్సి వస్తోందని, ఇది ప్రమాద తీవ్రతను పెంచుతుందని హెచ్చరించింది.
సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లతో ముప్పు
చార్‌ధామ్ యాత్రలో వినియోగిస్తున్న హెలికాప్టర్లన్నీ సింగిల్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ క్లాస్-3 విభాగానికి చెందినవేనని ఎఫ్ఐపీ తెలిపింది. వీటిలో ఆటోపైలట్, వెదర్ రాడార్ వంటి కీలక సాంకేతిక సదుపాయాలు కూడా లేవని పేర్కొంది. ఇంజిన్‌లో లోపం తలెత్తితే అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం తప్ప మరో మార్గం ఉండదని వివరించింది. అయితే పర్వత ప్రాంతాల్లో అందుకు అనువైన సురక్షిత ప్రదేశాలు లేకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ విమాన ప్రయాణాలతో పోలిస్తే హెలికాప్టర్ కార్యకలాపాల్లో ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొన్న ఎఫ్ఐపీ.. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Bharat Sleeper | పరుగులు తీసిన వందే భారత్ స్లీపర్ రైలు.. తొలిరోజు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన
నవంబర్ 2, 2026

Gold Rate | దీపావళి వేళ మళ్లీ మెరిసిన బంగారం.. ధరలు ఎంత పెరిగాయంటే..?
నవంబర్ 2, 2026

Actor Imran Khan | భవిష్యత్తులో ఎలాంటి నిరసనల్లో పాల్గొనను.. బాంబే హైకోర్టుకు హీరో ఇమ్రాన్ క్షమాపణలు..!
నవంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Harish Rao Alwala Speech | కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. వనపర్తిలో ఎందుకు పారవు?
- ●Chiranjeevi | ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై అమిత్ షాకు చిరంజీవి ఫిర్యాదు
- ●Vande Bharat Sleeper | పరుగులు తీసిన వందే భారత్ స్లీపర్ రైలు.. తొలిరోజు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన
- ●Telangana drought 2026 | ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువు కోరల్లో తెలంగాణ.. రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం?
- ●Mrunal Thakur | 15 కోట్ల బడ్జెట్ - కోటి కలెక్షన్స్ - ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ డిజాస్టర్ మూవీ
- ●Govardhan Puja 2026 | గోవర్ధన పూజ: ఆవు పేడతో కొండను ఎందుకు చేస్తారు? నగరాల్లో పురుడుపోసుకుంటున్న సరికొత్త సంప్రదాయం

Harish Rao Alwala Speech | కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. వనపర్తిలో ఎందుకు పారవు?

Chiranjeevi | ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై అమిత్ షాకు చిరంజీవి ఫిర్యాదు

Vande Bharat Sleeper | పరుగులు తీసిన వందే భారత్ స్లీపర్ రైలు.. తొలిరోజు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన

Telangana drought 2026 | ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువు కోరల్లో తెలంగాణ.. రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం?



