SEBI | సెబీ గ్రీన్ సిగ్నల్.. మూడు ఐపీఓలకు దారి క్లియర్..
SEBI | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మూడు కంపెనీల ఐపీఓలకు తుది ఆమోదం ఇచ్చింది. దీంతో లుధియానా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెన్నీ స్ట్రిప్స్‌తోపాటు కృష్ణా బిల్డ్‌స్పేస్, రోడెక్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఏజెన్సీస్ తమ పబ్లిక్ ఇష్యూలను నిర్ణీత గడువులో ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
SEBI | భారత మూలధన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మూడు కంపెనీల ఐపీఓలకు తుది ఆమోదం ఇచ్చింది. దీంతో లుధియానా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెన్నీ స్ట్రిప్స్‌తోపాటు కృష్ణా బిల్డ్‌స్పేస్, రోడెక్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఏజెన్సీస్ తమ పబ్లిక్ ఇష్యూలను నిర్ణీత గడువులో ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. 2025 డిసెంబర్ లో సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించిన రెన్నీ స్ట్రిప్స్, తాజా షేర్ల జారీ ద్వారా రూ.300 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు దేవ్ రాజ్ గుప్తా, ఉషా గుప్తా కలిసి 1.2 కోట్ల షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు. 1996లో స్థాపించిన రెన్నీ స్ట్రిప్స్ స్ట్రక్చరల్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ తయారీదారుగా గుర్తింపు పొందింది. స్టీల్ వాల్యూ చెయిన్‌లోని అనేక దశల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ డ్రాఫ్ట్ పత్రాల్లో పేర్కొన్న క్రిసిల్ నివేదిక ప్రకారం మైల్డ్ స్టీల్ బిల్లెట్స్, వైర్ రాడ్స్, హాట్-రోల్డ్ కాయిల్స్ నుంచి ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ పైప్స్ అండ్ ట్యూబ్స్, ప్రెసిషన్ ఫ్యాబ్రికేటెడ్ ఉత్పత్తులు, స్కాఫోల్డింగ్ సిస్టమ్స్, ఫార్మ్‌వర్క్ సొల్యూషన్స్ వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తోంది.
ఈ ఉత్పత్తులు నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్, వ్యవసాయం, షిప్‌బిల్డింగ్, హెవీ ఇంజినీరింగ్ వంటి అనేక రంగాల అవసరాలను తీర్చుతున్నాయి. కంపెనీ అనుసరిస్తున్న క్యాస్కేడింగ్ ప్రొడక్షన్ మోడల్ వల్ల తయారీ దశల మధ్య రీహీటింగ్ అవసరం ఉండదు. దీంతో ఇంధన వినియోగ సామర్థ్యం పెరగడంతోపాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. అలాగే ఆటోమేషన్, డిజిటల్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్‌ను కూడా కార్యకలాపాల్లో వినియోగిస్తోంది. రెన్నీ స్ట్రిప్స్ భారత్‌లోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 21 అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత కస్టమర్ నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకుంది. సెప్టెంబర్ 2025 నాటికి కంపెనీ 225 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందించింది. జిందాల్ సుప్రీమ్ ఇండియా, బీఆర్ గ్రీన్ ఇండస్ట్రీస్, కేఎన్‌ఎల్ డ్రైవ్‌లైన్ పార్ట్స్, మిట్టల్ సేల్స్ కార్పొరేషన్ వంటి సంస్థలు కంపెనీ కస్టమర్లలో ఉన్నాయి.
కంపెనీ ప్రధానంగా బిజినెస్-టు-బిజినెస్ (B2B) తయారీదారుగా పనిచేస్తూ, పారిశ్రామిక, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు స్ట్రక్చరల్ స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. రెన్నీ స్ట్రిప్స్‌తో పాటు కృష్ణా బిల్డ్‌స్పేస్, రోడెక్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ఏజెన్సీస్ కంపెనీల ఐపీఓలకు కూడా సెబీ ఆమోదం లభించింది. దీంతో ఈ మూడు సంస్థలు త్వరలోనే మార్కెట్ నుంచి నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నాయి.
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..






