Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
Red Fort Attack | గతేడాది ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి (Red Fort Attack) వెనుక ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (Al Qaeda in Indian Subcontinent) హస్తం ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సంచలన నివేదిక వెల్లడించింది. ఇది ఒక విచ్ఛిన్నమైన సంస్థ నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందుతోందని తెలిపింది.
Red Fort Attack | త్రినేత్ర.న్యూస్ : దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన వెనుక ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (Al Qaeda in Indian Subcontinent) హస్తం ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సంచలన నివేదిక వెల్లడించింది. అలాగే ఈ సంస్థ తన ప్రాంతీయ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు హెచ్చరించింది.
'ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' ఒక విచ్ఛిన్నమైన సంస్థ నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందుతోందని తెలిపింది. ఇది పెద్ద పెద్ద యూనిట్లకు బదులుగా దక్షిణాసియా అంతటా వికేంద్రీకృత, చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో పనిచేస్తోందని పేర్కొంది. ఈ క్రమంలోనే తమ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకుంటోందని వివరించింది. AQIS ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్‌లో క్రియాశీలకంగా ఉందని తెలిపింది. తన కార్యకలాపాలను విస్తరించేందుకు బంగ్లాదేశ్‌ను వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని యూఎన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడి ఈ సంస్థ పెరుగుతున్న ప్రమాదకర సామర్థ్యాలకు నిదర్శనమని సదరు నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ నిధులు సమకూర్చుకుంటూ, సరిహద్దు ప్రాంతాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని హెచ్చరించింది. అదే సమయంలో ఉగ్రసంస్థలు భద్రతా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు వికేంద్రీకృత నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని భద్రతా మండలి హెచ్చరించింది.
ఎన్ఐఏ దర్యాప్తు..
కాగా గతేడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో లాల్ కిలా మెట్రో స్టేషన్ గేట్ సిగ్నల్ వద్ద బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఓ కారులో పేలుడు సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు సమయంలో ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో గల అల్ ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్న కశ్మీరీ వైద్యుడు ఉమర్ ఉన్ నబీ కారు నడుపుతున్నాడు. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన ఉమర్ ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో పలువురు వైద్యులను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరందరికీ అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అన్సార్ గజ్వాతుల్ హింద్'కు చెందిన వైట్ కాలర్ ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) లోతైన దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ఎన్‌ఐఏ 7500 పేజీల ఛార్జ్‌షీట్‌ను రూపొందించింది. దాన్ని ఇటీవలే దిల్లీ కోర్టుకు సమర్పించింది. ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో పాటు మొత్తం 11 మందిని నిందితులుగా ఛార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో సోదాలు చేపట్టినట్లు తెలిపింది.
Also Read..
బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
- ●CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి
- ●Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి
- ●Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు
- ●IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి 'హైడ్రా' భగీరథ ప్రయత్నం
- ●TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడబ్ల్యూజే

NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి

Congress Party | అసలు కుట్రదారులపై అత్యంత కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోండి

Vemula Prashanth Reddy | ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌కు, ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు






