Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లను (Sewing Machine) అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. ఇందులోభాగంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లను (Sewing Machine) అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. ఇందులోభాగంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. సచివారంలో బీసీ మహిళలకు `ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు` పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో బీసీ ఎమ్మెల్యేల సూచనల మేరకు మైనార్టీలకు ఇస్తున్నట్లుగానే బీసీ మహిళలకు (BC Women) స్వయం ఉపాధి కోసం 100 శాతం సబ్సిడీ ద్వారా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. అర్హులైన మహిళలకు ఉచితంగానే ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందిస్తామని వెల్లడించారు. మేర కులస్తులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,పెట్రోల్ పంపులు, ఇందిరా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1000 చొప్పున లక్షా 19 వేల మందికి ఈ కుట్టు మిషన్ (Automatic Sewing Machines) పథకాన్ని లాంఛనంగా ప్రారంభించామన్నారు. 100 శాతం సబ్సిడి ద్వారా ఒక్కో కుట్టు మిషన్‌కి రూ.12 వేలు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించామని, త్వరలోనే భవన నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజా ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసుకొని బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే కుల గణన చేశామని, తదుపరి కార్యచరణ ముందుకు తీసుకుపోతామన్నారు.
బలహీన వర్గాల మహిళల స్వయం ఉపాధికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. విధివిధానాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. కుట్టు మిషన్ కావాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని, పథకం మొదటి దశలో చాలా మందికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని, శిక్షణ తప్పనిసరి చేస్తున్నామని వెల్లడించారు.
జ్యోతీబాపూలే.. సర్వాయి పాపన్న విగ్రహాలు..
ఆగస్టు 14న సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయ్ పూలే విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విష్కరించనున్నారని చెప్పారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ (Congress) చాంపియన్ అని చెప్పారు. ఆ మహినియులను స్మరిస్తూ ఇప్పటికే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌గా పేరు మార్చుకున్నామని గుర్తుచేశారు. సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసుకున్నామని తెలిపారు. ఈనెల 18న గోల్కొండ కోటను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రెండు కార్యక్రమాల్లో బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ - ఈ సారి సింగర్‌గా!
- ●Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ - ఈ సారి సింగర్‌గా!

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు






