UNSC | సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింస సరికాదు.. ఐరాసలో గళం విప్పిన భారత్
UNSC | యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని భారత్ (India) తీవ్రంగా ఖండించింది. సమాజాన్ని లొంగదీసుకోవడానికి, అసమ్మతిని తొక్కిపెట్టడానికి లైంగిక హింసను సాధనంగా ఉపయోగించడం కొనసాగుతోందని పేర్కొంది. లైంగిక హింస కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
International | Published On Jul 10, 2026, 12.22 pm IST
UNSC | త్రినేత్ర.న్యూస్ : యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధాల్లో, ఉగ్రవాదం, హింస, రాజకీయ అణచివేతకు లైంగిక హింసను ఒక సాధనంగా వాడుతున్నారని మండిపడింది. సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింస (Conflict-Related Sexual Violence)పై ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో (UNSC) జరిగిన బహిరంగ చర్చలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని (Parvathaneni Harish) మాట్లాడారు.
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించబడిన లైంగిక హింస కేసులు భారీగా పెరిగాయని ఐరాస సెక్రటరీ జనరల్ (UNSG) నివేదిక అంచనా వేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాల్లో తీవ్రమైన క్రూరత్వం దాగి ఉందన్నారు. సమాజాన్ని లొంగదీసుకోవడానికి, అసమ్మతిని తొక్కిపెట్టడానికి లైంగిక హింసను సాధనంగా ఉపయోగించడం కొనసాగుతోందన్నారు. లైంగిక హింస కేసుల్లో నిందితులు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హేయమైన చర్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని హరీష్ తెలిపారు. పెరుగుతున్న ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సమిష్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళా శాంతి పరిరక్షకుల పాత్ర కీలకం..
ఘర్షణల సంబంధిత లైంగిక హింసను నివారించడంలో మహిళా శాంతి పరిరక్షకుల పాత్రను హరీష్ ప్రముఖంగా ప్రస్తావించారు. వారి మోహరింపు అద్భుతమైన మార్పును తీసుకురాగలదని భారత్ నిరూపించిందన్నారు. ఈ సందర్భంగా 2007లో లైబీరియాకు ఐక్యరాజ్యసమితి చరిత్రలోనే మొట్టమొదటిసారి పూర్తి మహిళా పోలీసు విభాగాన్ని భారత్ పంపిన విషయాన్ని ఈ సందర్భంగా హరీష్ పర్వతనేని (Parvathaneni Harish) గుర్తు చేశారు.
ఈ విభాగం నేరాలను అదుపు చేయడంలో, లైంగిక, లింగ ఆధారిత హింసను నిరోధించడంలో, స్థానిక ప్రజల్లో భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని నింపడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. ఘర్షణల సంబంధిత లైంగిక హింసను నివారించడంలో చేసిన కృషికి గానూ భారత శాంతి భద్రతల పరిరక్షకులు మేజర్ మోయిజ్ యాసిన్, మేజర్ సోనియా దేవేంద్ర నవస్కర్ 2026 సంవత్సరానికి గానూ 'ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్' గుర్తింపు పత్రాన్ని అందుకోనున్నట్లు హరీష్ పర్వతనేని ఈ సందర్భంగా ప్రకటించారు.
లైంగిక హింసను అరికట్టడంలో UNMISలో (యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సుడాన్) ఫోర్స్ అంబుడ్స్‌పర్సన్, వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మేజర్ మోయిజ్ యాసిన్ తీవ్రంగా కృషి చేశారు. భద్రతా దళాలు, పోలీసులను అందించే దేశాల సైనిక పరిశీలకులతో కలిసి 40కి పైగా ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. అంతేకాకుండా ఒక ఫోర్స్ జెండర్ డేటాబేస్‌ను కూడా స్థాపించారు. ఇక మహిళా సైనికులకు ఫోకల్ పాయింట్‌గా, UNMIS జెండర్ టాస్క్‌ఫోర్స్ సభ్యురాలిగా ఉన్న మేజర్ సోనియా దేవేంద్ర నవస్కర్.. ఘర్షణల సంబంధిత లైంగిక హింసను నివారించే లక్ష్యంతో ఇంటెలిజెన్స్, ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలకు తన సహకారాన్ని అందించారు. యూఎన్ పోలీసుల ఉత్తమ ప్రాక్టీస్ నెట్‌వర్క్‌లను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. లింగ సంబంధిత సమస్యలపై ఆతిథ్య దేశంతో కలిసి పనిచేశారు.
సంబంధిత వార్తలు

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
ఆగస్టు 13, 2026

UNGA | జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
జూన్ 6, 2026

UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
మే 27, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



