Indus Water Treaty | సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిలో మార్పులు లేదు.. పాక్‌కు స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
Indus Water Treaty | సింధు జల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాకిస్తాన్ సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదానికి తన మద్దతును ఉపసంహరించుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
Indus Water Treaty | సింధు జల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాకిస్తాన్ సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదానికి తన మద్దతును ఉపసంహరించుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కొనసాగిస్తున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజం కారణంగా ఈ ఒప్పందాన్ని ప్రస్తుతం నిలిపివేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చలు కొనసాగాలంటే, పాకిస్తాన్ ముందుగా ఉగ్రవాదానికి ఇచ్చే మద్దతును పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నారు. ఇక వెనిజువెలాలో మరణించిన భారతీయ నావికుడు రాకేశ్ చౌహాన్ విషయంలోనూ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన మృతదేహం తారుమారు జరిగిందన్న ఆరోపణలు, అవయవాలు తీశారన్న అనుమానాలపై వెనిజువెలా ప్రభుత్వాన్ని తక్షణమే, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని భారత్ విజ్ఞప్తి చేసిందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
తీస్తా నది ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. భారత్ సహాయం రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించిన రోడ్‌మ్యాప్ ఆధారంగానే కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని సమయానుసారంగా సమీక్షిస్తున్నట్టు పేర్కొంటూ.. తీస్తా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బంగ్లాదేశ్‌కు భారత్ తన అభిప్రాయాన్ని తెలియజేసిందని వెల్లడించారు. భవిష్యత్ విధానాన్ని రూపొందించే సమయంలో అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖామెనీ అంత్యక్రియల సందర్భంగా భారత ప్రతినిధి బృందం పంపిన విషయంపై విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరెటా ఇవాళ టెహ్రాన్‌కు బయలుదేరినట్లు తెలిపింది. ఇద్దరు అంత్యక్రియల కార్యక్రమంలో భారత్ తరఫున పాల్గొంటారని వెల్లడించింది.
అఫ్గానిస్థాన్ విషయంపై మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్థాన్‌పై జరిగిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిపింది. అఫ్గానిస్థాన్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ మద్దతును ప్రకటించింది. అదే సమయంలో అఫ్గానిస్థాన్‌కు భారత్ అందిస్తున్న మానవతా సహాయం కొనసాగుతుందని, మందులు సహా అవసరమైన ఇతర సహాయాన్ని ఇప్పటికీ పంపిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
ఆగస్టు 23, 2026

Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
ఆగస్టు 23, 2026

CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్



