Advanced Tip | ముందస్తు టిప్ కుదరనే కుదరదు.. యాప్ లో నుంచి ఆప్షన్ తొలగించండి..క్యాబ్ సంస్థలకు కేంద్రం ఝలక్..
Advanced Tip | ప్రయాణికులు ఉబర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో ఇకపై ముందుగానే టిప్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటార్ వాహనాల అగ్రిగేటర్లకు ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లను తమ యాప్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Advanced Tip | ప్రయాణికులు ఉబర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో ఇకపై ముందుగానే టిప్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటార్ వాహనాల అగ్రిగేటర్లకు ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లను తమ యాప్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. క్యాబ్ త్వరగా లభించాలనే ఉద్దేశంతో లేదా రైడ్ దొరికే అవకాశాలు మెరుగుపడతాయనే భావనతో ప్రయాణికులు అదనపు మొత్తం చెల్లించేలా ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది. ఇటీవల రైడ్ బుకింగ్ సమయంలో కొన్ని రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు అడ్వాన్స్ టిప్, చూస్ యాన్ యాడ్-ఆన్, ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్వికర్ రైడ్ కన్ఫర్మేషన్ వంటి సందేశాలను చూపిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. దీంతో ప్రయాణికుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. టిప్ చెల్లిస్తే డ్రైవర్ తమ రైడ్‌ను త్వరగా అంగీకరిస్తారని లేదా రైడ్ కన్ఫర్మేషన్ వేగంగా జరుగుతుందని ప్రయాణికులు భావించే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది.
ఫీచర్లను తొలగించాలని ఆదేశం..
మోటార్ వాహనాల అగ్రిగేటర్లు తమ మొబైల్ అప్లికేషన్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వెంటనే సమీక్షించి, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025కు అనుగుణంగా లేని ఫీచర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైడ్ పూర్తయ్యే ముందు టిప్, సందేశం, యాడ్-ఆన్ లేదా చెల్లింపు ఆప్షన్‌ను చూపించి, అదనంగా డబ్బు చెల్లిస్తే సేవ లభ్యత లేదా నాణ్యతపై ప్రభావం ఉంటుందనే భావన కలిగించేలా యాప్ ఉండకూడదని స్పష్టం చేసింది. డ్రైవర్ రైడ్‌ను అంగీకరించడం, బుకింగ్ ఎంత వేగంగా కన్ఫర్మ్ కావడం, ఏ డ్రైవర్‌ను కేటాయించడం లేదా ప్రయాణికుడు ఎంతసేపు వేచి ఉండాల్సి రావడం వంటి అంశాలపై టిప్ ప్రభావం చూపుతుందనే భావన కలిగించే ఎలాంటి ఆప్షన్ ఉండకూడదు. సరళంగా చెప్పాలంటే.. క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా డబ్బు చెల్లిస్తే రైడ్ త్వరగా లేదా సులభంగా లభిస్తుందనే భావన ప్రయాణికులకు కలగకూడదు. 2025 మార్గదర్శకాలకు అనుగుణంగా తమ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అవసరమైన మార్పులు వెంటనే చేయాలని ప్రభుత్వం అగ్రిగేటర్లను ఆదేశించింది.
రైడ్ పూర్తయ్యాక ఇవ్వొచ్చు..
అయితే రైడ్ పూర్తయ్యాక ప్రయాణికులు తమ అనుభవాన్ని బట్టి డ్రైవర్లకు టిప్ ఇవ్వవచ్చు. దీన్ని ప్రభుత్వం నిషేధించలేదు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025లోని క్లాజ్ 14.15 ప్రకారం ప్రయాణికులు డ్రైవర్‌కు స్వచ్ఛందంగా టిప్ ఇవ్వవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉండాలి. ప్రయాణికుడు ఇచ్చిన మొత్తం టిప్ డ్రైవర్‌కే చేరాలి. అగ్రిగేటర్ అందులో నుంచి ఎలాంటి మొత్తాన్ని మినహాయించకూడదు. అంటే రైడ్ పూర్తయిన తర్వాత డ్రైవర్ సేవలను మెచ్చి టిప్ ఇవ్వడం ప్రయాణికుడి ఇష్టం. కానీ క్యాబ్ బుకింగ్‌కు ముందు టిప్ చెల్లిస్తే రైడ్ త్వరగా లేదా సులభంగా లభిస్తుందనే విధంగా దాన్ని చూపించడం మాత్రం నిషేధం.
టిప్ పూర్తిగా స్వచ్ఛందమే..
రైడ్ బుకింగ్ ప్రక్రియలో ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లు, సందేశాలను కొన్ని రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగిస్తున్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. గతంలోనే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఇలాంటి విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. తాజా కేంద్ర ప్రభుత్వ ఆదేశం ద్వారా టిప్ అంటే పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. క్యాబ్ లభ్యత, డ్రైవర్ రైడ్‌ను అంగీకరించడం, బుకింగ్ వేగం లేదా సేవ నాణ్యతతో టిప్‌ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుసంధానం చేయకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025కు అనుగుణంగా తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను మార్చుకోవాలని అగ్రిగేటర్లకు ఆదేశించింది. దీంతో ప్రయాణికులకు క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో ఒక అదనపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తగ్గనుంది. ప్రయాణం పూర్తయిన తర్వాత డ్రైవర్‌కు టిప్ ఇవ్వాలా వద్దా అనే విషయం ప్రయాణికుడి ఇష్టం. అయితే రైడ్ దొరికేందుకు ముందుగానే అదనపు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఇకపై ఉండదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kavitha | రేట్ల విషయంలో పట్టిపీడిస్తున్న అగ్రిగేటర్లు.. ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పక్షాన నిలబడాలి: కవిత
జులై 22, 2026

Uber | ఉబెర్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లు.. ప్రయాణం మరింత సురక్షితం..
జులై 1, 2026

Ola S1 X Plus 5.2 kWh | ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ
- ●ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
- ●Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
- ●Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Google Pixel 11 | గూగుల్ పిక్సల్ 11 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయిన ఫీచర్లు..
- ●Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ - ఈ సారి సింగర్‌గా!

Monsoon Session | 12 బిల్లులకు ఆమోదం.. ఒక్క దానిపైనే చర్చ

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం



