Google Pixel 11 | గూగుల్ పిక్సల్ 11 సిరీస్ వచ్చేసింది.. అదిరిపోయిన ఫీచర్లు..
Google Pixel 11 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు పిక్సల్ 11, పిక్సల్ 11 ప్రొ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్‌లను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ హామీ ఇచ్చినట్లుగానే ఈ మూడు ఫోన్‌లను భారత మార్కెట్‌లోనూ విడుదల చేసింది.
Technology | Published On Aug 13, 2026, 1.05 pm IST
Google Pixel 11 | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు పిక్సల్ 11, పిక్సల్ 11 ప్రొ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్‌లను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ హామీ ఇచ్చినట్లుగానే ఈ మూడు ఫోన్‌లను భారత మార్కెట్‌లోనూ విడుదల చేసింది. కొత్త పిక్సల్ 11 సిరీస్‌లో పనితీరు మెరుగుదల, అధిక మన్నిక, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా హార్డ్‌వేర్‌తోపాటు గూగుల్ జెమిని కృత్రిమ మేధస్సు వ్యవస్థతో మరింత లోతైన అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించింది. మూడు మోడళ్లలోనూ ఎడ్జ్-టు-ఎడ్జ్ గ్లాస్ కెమెరా బార్‌తో కొత్త డిజైన్‌ను అందించారు. బేస్ పిక్సల్ 11లో కెమెరా బార్ మందాన్ని 40 శాతం తగ్గించారు. అధికారిక మేడ్ బై గూగుల్ కేస్‌లను ఉపయోగించినప్పుడు ఇది ఫోన్‌తో సమంగా అమరుతుంది. దీంతో ఫోన్‌ను సమతల ఉపరితలంపై ఉంచినప్పుడు కదలడం కూడా తగ్గుతుంది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
పిక్సల్ 11లో ఆక్టువా డిస్‌ప్లే, శాటిన్ మెటల్ ఫ్రేమ్, పాలిష్డ్ గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. ఈ ఫోన్ పిస్తాచియో, హైబిస్కస్, ఫ్రాస్ట్, అబ్సిడియన్ అనే నాలుగు రంగుల్లో లభిస్తోంది. పిక్సల్ 11 ప్రొ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్ మోడళ్లలో గూగుల్ సూపర్ ఆక్టువా డిస్‌ప్లేను అందించింది. ఇవి గరిష్ఠంగా 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. స్క్రీన్‌పై కొత్త యాంటీ-స్క్రాచ్ కోటింగ్‌ను అందించారు. ఇది గత తరాల కంటే రెండింతలకు పైగా స్క్రాచ్ నిరోధకతను అందిస్తుంది. ఈ మోడళ్లు క్యాన్యన్, ఫాగ్, ఆలివ్, పూర్తిగా మ్యాట్ అబ్సిడియన్ రంగుల్లో లభిస్తాయి. మూడు మోడళ్లలోనూ బేస్ స్టోరేజ్‌ను ఇప్పుడు 256 జీబీకి పెంచారు. ఇంటర్నల్ పిక్సల్‌స్నాప్ మాగ్నెట్ ఇంటిగ్రేషన్‌ను అందించారు. పిక్సల్ 11, పిక్సల్ 11 ప్రొ మోడళ్లు క్యూఐ 2.2 25 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్‌లో 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్ పొందవచ్చని గూగుల్ తెలిపింది.
![]()
హైలైట్ కాంటెక్స్టువల్ అలర్ట్ సిస్టమ్..
పిక్సల్ 11 ప్రొ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్ మోడళ్లకు ప్రత్యేకంగా హైలైట్ అనే కాంటెక్స్టువల్ అలర్ట్ సిస్టమ్‌ను అందించారు. ఫోన్‌ను స్క్రీన్ కిందివైపు ఉంచినప్పుడు వెనుక కెమెరా ఫ్లాష్ చుట్టూ ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వెలిగే వెలుగుల నమూనాలను ప్రదర్శిస్తాయి. జెమిని వినడం, ప్రాసెస్ చేయడం లేదా స్పందించడం వంటి స్థితి మార్పులను ఈ లైట్లు సూచిస్తాయి. అలాగే ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ముఖ్యమైన కాంటాక్ట్‌లను గుర్తించేందుకు వినియోగదారులు ప్రత్యేక రంగు కోడ్‌లను కేటాయించుకునే అవకాశం ఉంటుంది. పిక్సల్ 11 సిరీస్‌లో కొత్త ఇమేజ్ సెన్సార్లతోపాటు అప్‌డేట్ చేసిన పోస్ట్-ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించారు. కొత్త ఆన్‌బోర్డ్ సిలికాన్ ఈ కెమెరా ప్రాసెసింగ్‌కు పవర్‌ను ఇస్తుంది. పిక్సల్ 11లో 48 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్‌ను అందించారు. ఇది 56 శాతం ఎక్కువ లైట్ సెన్సిటివిటీని అందిస్తుంది. ఇందులో 5ఎక్స్ టెలిఫొటో లెన్స్‌తో 30ఎక్స్ వరకు సూపర్ జూమ్ లభిస్తుంది. టెన్సర్ జి6 ద్వారా డిజిటల్ జూమ్ పరిధిని మరింత విస్తరించారు.
మెరుగైన కెమెరాలు..
పిక్సల్ 11 ప్రొ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్ మోడళ్లలో పిక్సల్ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు అందించే కొత్త ప్రైమరీ సెన్సార్‌ను ఉపయోగించారు. 48 మెగాపిక్సల్ రీడిజైన్ చేసిన టెలిఫొటో సెన్సార్ 30 శాతం మెరుగైన లైట్ సెన్సిటివిటీని అందిస్తుంది. 5ఎక్స్ ఫోకల్ లెంగ్త్‌లో పోర్ట్రెయిట్ మోడ్, 120ఎక్స్ వరకు ప్రొ జూమ్‌ను అందించారు. లో-లైట్, నైట్ సైట్ పనితీరును కూడా మెరుగుపరిచారు. కొత్త ఫాస్ట్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఇంటిగ్రేషన్‌తో పిక్సల్ 11 ప్రొ సిరీస్‌లో నైట్ సైట్ క్యాప్చర్ వేగం గత మోడళ్లతో పోలిస్తే 4.5 రెట్లు వరకు మెరుగుపడింది. పిక్సల్ 11 సిరీస్‌కు గూగుల్ టెన్సర్ జి6 సిస్టమ్-ఆన్-చిప్ ప్రధాన పవర్ గా పనిచేస్తుంది. తాజా జెమిని నానో మోడల్‌ను నేరుగా డివైస్‌లోనే అమలు చేసేలా దీన్ని రూపొందించారు.
![]()
డిజిటల్ ముప్పు నుంచి రక్షణ..
అప్‌గ్రేడ్ చేసిన సీపీయూ ఆర్కిటెక్చర్ కారణంగా వెబ్ బ్రౌజింగ్ వేగం 25 శాతం, యాప్ ఓపెన్ చేసే వేగం 15 శాతం మెరుగుపడిందని గూగుల్ తెలిపింది. ఏఐ ప్రాసెసింగ్ కోసం 50 శాతం అధిక టీపీయూ కంప్యూట్ పవర్‌ను అందించారు. స్థానిక ఏఐ టాస్క్‌లను గత టెన్సర్ మోడళ్ల కంటే 3.5 రెట్లు వేగంగా ప్రాసెస్ చేయడంతోపాటు 3.5 రెట్లు తక్కువ పవర్‌ను వినియోగించేలా రూపొందించారు. భద్రత పరంగా కొత్త టైటాన్ ఎం3 సెక్యూరిటీ కోప్రాసెసర్‌ను టెన్సర్ జి6తో కలిపారు. సెక్యూర్ బూట్ ఆపరేషన్ల సమయంలో పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే డిజిటల్ ముప్పుల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు.
గూగుల్ పిక్సల్ 11 స్పెసిఫికేషన్లు..
గూగుల్ పిక్సల్ 11లో 6.3 ఇంచుల 1080 * 2424 పిక్సల్స్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 60, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌లకు మద్దతు ఇస్తుంది. హెచ్‌డీఆర్‌లో 2000 నిట్స్, గరిష్ఠంగా 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ జి6 ప్రాసెసర్, టైటాన్ ఎం3 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. డ్యుయల్ సిమ్, నానో సిమ్, ఈసిమ్ సపోర్ట్ ఉన్నాయి. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సల్ 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 10.8 మెగాపిక్సల్ 5ఎక్స్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 10.5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 4కె వీడియో రికార్డింగ్, ఫేస్ అన్‌లాక్‌కు ఇది సపోర్ట్‌ను ఇస్తుంది.
అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోన్ ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 6 ఎల్‌ఈ, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్, డ్యయల్ బ్యాండ్ జీఎన్‌ఎస్ఎస్, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యుజెడ్ఎస్‌ఎస్, బీడీయూ, నావిక్, యూఎస్‌బీ టైప్ సి 3.2, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాటిలైట్ ఎస్ఓఎస్ ఫీచర్ మాత్రం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పిక్సల్ 11లో 4985 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 25 వాట్ల క్యూఐ 2.2 పిక్సల్‌స్నాప్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
![]()
పిక్సల్ 11 ప్రొ, 11 ప్రొ ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్లు..
పిక్సల్ 11 ప్రొలో 6.3 ఇంచుల 1280 * 2856 పిక్సల్స్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 1 నుంచి 120 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. హెచ్‌డీఆర్‌లో 2400 నిట్స్, గరిష్ఠంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్‌లో 6.8 ఇంచుల 1344 * 2992 పిక్సల్స్ క్యూడీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది కూడా 1 నుంచి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. హెచ్‌డీఆర్‌లో 2400 నిట్స్, గరిష్ఠంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. రెండు మోడళ్లలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంది. ఈ రెండు మోడళ్లలో గూగుల్ టెన్సర్ జి6 ప్రాసెసర్, టైటాన్ ఎం3 సెక్యూరిటీ చిప్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ, 512 జీబీ, 1 టెరాబైట్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17తో వస్తాయి. డ్యుయల్ సిమ్, నానో సిమ్, ఈసిమ్ సపోర్ట్ ఉన్నాయి.
వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 48 మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 48 మెగాపిక్సల్ 5ఎక్స్ టెలిఫొటో కెమెరా ఉండగా, ఈ కెమెరా వ్యవస్థ ప్రొ రెస్ జూమ్ ద్వారా 100ఎక్స్ వరకు జూమ్, 10-బిట్ హెచ్‌డీఆర్ రికార్డింగ్, సినిమాటిక్ బ్లర్, 4కె 60 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వీడియో బూస్ట్ ద్వారా 24, 30 ఎఫ్‌పీఎస్‌లలో 8కె వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. ముందు భాగంలో 42 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందించారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6 ఎల్‌ఈ, డ్యుయల్ బ్యాండ్ జీఎన్‌ఎస్ఎస్, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యుజెడ్ఎస్‌ఎస్, బీడీయూ, నావిక్, యూఎస్‌బీ టైప్ సి 3.2, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. పిక్సల్ 11 ప్రొ లో 4850 ఎంఏహెచ్ బ్యాటరీ, పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్‌లో 5115 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వీటిలో వరుసగా 30 వాట్లు, 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 25 వాట్ల క్యూఐ 2.2 పిక్సల్‌స్నాప్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
భారత్‌లో ధరలు ఇవే..
పిక్సల్ 11 ఫోన్‌కు చెందిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,04,999గా ఉంది. పిక్సల్ 11 ప్రొ ఫోన్‌కు చెందిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,999 ఉండగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,999గా ఉంది. పిక్సల్ 11 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్‌కు చెందిన 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,999 ఉండగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,49,999గా నిర్ణయించారు. పిక్సల్‌స్నాప్ కేస్ ధర రూ.4900గా ఉంది. పిక్సల్‌స్నాప్ ఛార్జర్ ధర రూ.4500 ఉంది. స్టాండ్‌తో కూడిన పిక్సల్‌స్నాప్ ఛార్జర్ ధర రూ.6939 కాగా, పిక్సల్‌స్నాప్ రింగ్ స్టాండ్ ధర రూ.2979గా ఉంది. పిక్సల్ 11 సిరీస్ ఫోన్‌లను ప్రస్తుతం గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
గూగుల్ ఇండియా స్టోర్‌లో లాంచ్ ఆఫర్లు..
గూగుల్ ఇండియా స్టోర్‌లో పిక్సల్ 11 కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలకు రూ.7వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పిక్సల్ 11 ప్రొ, పిక్సెల్ 11 ప్రొ ఎక్స్ఎల్ మోడళ్లపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నారు. అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.9వేల వరకు అదనపు ఎక్స్చేంజ్ బోనస్ ను పొందే అవకాశం కూడా ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ - ఈ సారి సింగర్‌గా!
- ●Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ - ఈ సారి సింగర్‌గా!

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు



