UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
UNSC | భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్‌కు భారత్ (India) గట్టిగా సమాధానం ఇచ్చింది. దశాబ్దాలుగా పాక్ సృష్టిస్తున్న నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టింది. నరమేధం సృష్టించిన చరిత్ర ఉన్న దేశం.. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని వ్యాఖ్యానించారు.
International | Published On May 21, 2026, 12.20 pm IST
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో పాకిస్థాన్‌కు (Pakistan) మరోసారి భంగపాటు తప్పలేదు. భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేసిన దాయాదికి భారత్ (India) గట్టిగా సమాధానం ఇచ్చింది. దశాబ్దాలుగా పాక్ సృష్టిస్తున్న నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ‘సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణ’ (Protection of civilians in armed conflict) అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయ చట్టాలు, ఉన్నత విలువల గురించి మాట్లాడుతూ భారత్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు. దీన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) గట్టిగా తిప్పికొట్టారు. నరమేధం సృష్టించిన చరిత్ర ఉన్న దేశం.. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఆ దాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..
ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్థాన్‌పై పాక్ జరిపిన దాడులను భారత ప్రతినిధి ప్రస్తావించారు. ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో కాబూల్‌లోని 'ఓమిడ్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్'పై పాకిస్థాన్ జరిపిన దాడులని ప్రపంచం ఇంకా మర్చిపోలేదన్నారు. వైద్య కేంద్రంపై జరిగిన ఘోరమైన హింసాకాండలో 269 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. మరో 122 మంది గాయపడినట్లు చెప్పారు. చీకట్లో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ.. అంతర్జాతీయ చట్టాల గురించి గొప్పగా మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో విమర్శించారు.
సొంత ప్రజలపైనే దారుణాలు..
పాక్ సైన్యం గతంలో చేసిన ఘోరాలను ఈ సందర్భంగా భారత్ ప్రపంచం ముందు పెట్టింది. 1971లో ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో పాక్ ఆర్మీ సొంత పౌరులపైనే అణచివేతకు పాల్పడిందని గుర్తుచేసింది. సుమారు 4 లక్షల మంది మహిళలపై పాక్ సైనికులు దారుణాలకు ఒడిగట్టారని తెలిపింది. ఓ క్రమపద్ధతిలో సాగించిన సామూహిక అత్యాచారాల ప్రచారాన్ని ఆ దేశమే ఒప్పుకుందని పర్వతనేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ.. ఓ పద్ధతి ప్రకారం మారణహోమాలకు పాల్పడే దేశం ఇలాంటి దురాక్రమణ చర్యలు పాల్పడంలో ఆశ్చర్యకరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
Also Read..
విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 'మెలోడీ' రీల్.. 24 గంటల్లోనే..
సంబంధిత వార్తలు

Govind Mohan | దేశంలో స్వదేశీ ఉగ్రవాదం దాదాపు అంతమైపోయింది : హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్
అక్టోబర్ 17, 2026

UN | యువశక్తి దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలా..? ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం
అక్టోబర్ 17, 2026

US Sanctions | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట!
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
- ●Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
- ●Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి
- ●Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్కడంటే!

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక



