Ebola | ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు
Ebola | ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా (Ebola) విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi IGI Airport) అధికారులు అలర్ట్ అయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులకు (International Travellers) కీలక అడ్వైజరీ జారీ చేశారు.
Ebola | ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా (Ebola) విజృంభిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 140 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. తాజాగా దేశంలోనూ ఎబోలా భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi IGI Airport) అధికారులు అలర్ట్ అయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులకు (International Travellers) కీలక అడ్వైజరీ జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ సహా వివిధ ఆఫ్రికా దేశాల నుంచి దేశంలోకి ప్రవేశించే ప్రయాణికులు ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.
జ్వరం, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు ఉన్న ప్రయాణికులు వెంటనే ఎయిర్‌పోర్టులోని హెల్త్ డెస్క్‌ను సంప్రదించాలని తెలిపారు. ఒకవేళ ఇండియాకు వచ్చిన 21 రోజుల తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య సాయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. అదేవిధంగా ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎలా వ్యాపిస్తుంది..
కాగా, 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ వ్యాప్తిలోకి రావడం ఇది 17వ సారి. ఇది ప్రాణాంతక వైరస్. గబ్బిలాలు, కోతులు, చింపాంజీలు, అడవి దుప్పులు (forest antelopes) ద్వారా ఇది సోకుతుంది. ఎబోలా వైరస్ సోకిన వ్యక్తులు లేదా జంతువుల రక్తం, ఇతర శరీర ద్రవాలు వాంతులు, మలమూత్రాలు తాకడం వల్ల ఇతరులకు సోకుతుంది.
ఇవీ లక్షణాలు..
ఈ వైరస్ లక్షణాలు ఇంచుమించు కరోనా లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం వంటివి ఉంటాయి. వ్యాధి ముదిరితే వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, చర్మంపైఊ దద్దుర్లు, శరీరంపై అక్కడకడ్కడా కమిలినట్లు ఉండటం, కళ్లు పసుపు రంగులోకి రారడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాలు పనితీరు కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రారంభ దశలోనే తగిన చికిత్స తీసుకుంటే మంచిది.
Also Read..
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 'మెలోడీ' రీల్.. 24 గంటల్లోనే..
మీ సేవింగ్స్ అకౌంట్‌పై 'ఐటీ' కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ - స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
తాజావార్తలు
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు
- ●Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి
- ●Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి
- ●KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక

Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు

Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి






