Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
Vijay Cabinet | తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని (Cabinet Expansion) భారీగా విస్తరించింది.
Vijay Cabinet | తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని (Cabinet Expansion) భారీగా విస్తరించింది. కొత్తగా 23 మంది ఎమ్మెల్యేలను విజయ్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిలో విజయ్ టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కాగా, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు (Congress MLAs) ఉన్నారు.
కేబినెట్‌లోకి కొత్తగా 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ముఖ్యమంత్రి విజయ్ చేసిన సిఫార్సులకు తమిళనాడు గవర్నర్ అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని చెన్నైలోని లోక్ భవన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇవాళ కొత్త ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా.. తాజా విస్తరణతో విజయ్ సర్కార్‌లోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది.
#WATCH | Chennai | TVK and Congress MLAs take oath as Tamil Nadu Ministers in the presence of CM Vijay and Governor Rajendra Vishwanath Arlekar
The CM has recommended to induct 23 MLAs into the Council of Ministers and the state Governor approved the recommendation made by the… pic.twitter.com/6Svw7eJZKb
— ANI (@ANI) May 21, 2026
59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలోకి కాంగ్రెస్..
ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల (59 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలో భాగస్వామి అయ్యింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు తమిళనాడు కేబినెట్‌లోకి అడుగుపెట్టారు.
టీవీకే (TVK)కే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్న ఐయూఎంఎల్ (IUML), వీసీకే (VCK) మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ రెండు పార్టీల నాయకులు కూడా మంత్రి మండలిలో చేరాలని, ఇది ముఖ్యమంత్రి విజయ్ కోరిక అని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్, క్రీడల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మీడియాకు వెల్లడించారు. అయితే, వారు తమ నిర్ణయాన్ని ఇంకా తెలియకపోవడంతో ప్రస్తుతానికి కేబినెట్‌లోకి తీసుకోలేదు. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక లెఫ్ట్ పార్టీలు (CPI, CPM) మాత్రం ప్రభుత్వానికి బయట నుంచి (outside support) మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోగా, వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు అధికార పార్టీ స్పష్టం చేసింది.
Also Read..
ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 'మెలోడీ' రీల్.. 24 గంటల్లోనే..
గోదావరి - కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
సంబంధిత వార్తలు

Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు
అక్టోబర్ 11, 2026

CM Vijay | రాహుల్‌తో లంచ్.. మోదీతో మెట్రో రైడ్.. సీఎం విజయ్ తగ్గేదేలేదు
అక్టోబర్ 10, 2026

BY Polls | ఉప ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న అధికార పార్టీలు.. తమిళనాడులో టీవీకే ఘన విజయం
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
- ●Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
- ●Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి
- ●Firecrackers Seized | ఇంట్లోనే 20 లక్షల విలువైన పటాకులు.. ఎక్కడంటే!

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక



