Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అన్ని రంగాలకు చెందిన విభాగాల్లోనూ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ50 రెండూ 1 శాతానికి పైగా పెరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం మెరుగైన ప్రదర్శన చేశాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అన్ని రంగాలకు చెందిన విభాగాల్లోనూ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ50 రెండూ 1 శాతానికి పైగా పెరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం మెరుగైన ప్రదర్శన చేశాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ మొదలైనా పెట్టుబడిదారులు వాటిని పట్టించుకోకుండా వృద్ధి చెందుతున్న కంపెనీల షేర్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించారు. విలువ ఆధారిత షేర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. శుక్రవారం సెషన్ లో సెన్సెక్స్ 828 పాయింట్లు (1.08 శాతం) పెరిగి 77,569.39 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 244 పాయింట్లు (1.02 శాతం) పెరిగి 24,206.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.40, 1.55 శాతం చొప్పున లాభపడ్డాయి.
రూ.6 లక్షల కోట్ల లాభం..
మార్కెట్లలో నమోదైన భారీ ర్యాలీతో పెట్టుబడిదారుల సంపద ఒక్క సెషన్‌లోనే భారీగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయి ఉన్న మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటల్ గత సెషన్‌లోని రూ.476 లక్షల కోట్ల నుంచి రూ.482 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ యుద్ధ భయాలు నెలకొనడంతో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.71 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 76 డాలర్ల వద్ద నిలవగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.76 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 71 డాలర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్‌లో మరోమారు భారత రూపాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 6 పైసలు లాభపడ్డ రూపాయి 95.31 వద్ద నిలిచింది.
వచ్చే వారం కీలకం..
కాగా రెండు వరుస సెషన్‌లలో మార్కెట్లు లాభాల్లో ముగియడంతో సెన్సెక్స్ మొత్తం మీద 1,066 పాయింట్లు కోలుకోగా, నిఫ్టీ 50 సూచీ 325 పాయింట్లు పెరిగింది. అయితే వారం ముగింపు ప్రకారం చూస్తే సూచీలు ఇంకా నష్టాల్లోనే ఉన్నప్పటికీ చాలా వరకు కోలుకున్నాయి. గత వారంతో పోలిస్తే మార్కెట్లు కాస్త దిగువన ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం సూచీల దిశకు కీలకంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
ఆగస్టు 13, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
ఆగస్టు 13, 2026

Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



