Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మా పార్టీలోకి వస్తానని చెబితే మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మా పార్టీలోకి వస్తానని చెబితే మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హరీశ్‌రావు పదేండ్లు మంత్రిగా ఉండి ఏం చేశావు.. నీటి ఎత్తిపోతలకు మళ్లీ మూడు నెలల టైమ్ ఎందుకు ఇవ్వాలని హరీశ్‌రావును మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.. అవన్నీ తొలగిపోతాయి. క్రమశిక్షణ కమిటీ అందరికీ సమానమే. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం కొంత మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇచ్చారు. కడియం శ్రీహరి, కొండా సురేఖ, తుంగతుర్తి పంచాయితీ విషయంలో సచిన్ సావంత్, జగ్గారెడ్డి ఇద్దరు విషయ సేకరణ చేసి పార్టీకి ఇస్తారు.. ఆ తరువాత చర్యలు ఉంటాయి. ఇద్దరు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించాం. వారి నుండి విషయ సేకరణ చేసిన తరువాత చర్యలు ఉంటాయని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
మా పాలన బాగుంది జనాలు మమ్మల్ని ఆదరీస్తున్నారు..
మీ 12 ఏండ్ల పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగింది ఏంది.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. మా పాలన బాగుంది జనాలు మమ్మల్ని ఆదరీస్తున్నారు.. వేరే పార్టీలు తలుపులు తెరిచి ఉంచిన మూసి ఉంచిన ఏమి లాభం లేదు అని ఆయన పేర్కొన్నారు.
రీజినల్ పార్టీకి రూ. 1400 కోట్లు ఎలా వచ్చాయి..?
కవిత ఆరోపణల్లో నిజం ఉంది. రీజినల్ పార్టీకి రూ. 1400 కోట్లు ఎలా వచ్చాయి..? మా అభివృద్ధి చూసి హరీష్ రావు మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూస్తున్నారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడి జరిగినప్పడు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్‌లో ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పని చేసిండు. ప్రజల సొత్తును దుర్వినియోగం చేశారు. కానీ జరిగిన తప్పిదాలను రాజేందర్ ప్రశ్నించలేదు. బీఆర్ఎస్‌కు ఈటెల రాజేందర్ మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తుంది అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
బీజేపీ గురించి తెలిసీ ప్రజలు గోతిలో పడరు..
నడ్డా వచ్చినా, నబీన్ వచ్చిన ఒక్కటే సూటి ప్రశ్న. మీరు ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రానికి రావాలి. పన్నెండు ఏండ్ల బీజేపీ పాలనను ప్రజలు చూశారు. బీజేపీ గురించి తెలిసీ ప్రజలు గోతిలో పడరు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌తో చర్చించి కార్పొరేషన్ పదవులపై నిర్ణయం తీసుకుంటామని మమేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
జులై 10, 2026

Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
జులై 10, 2026

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
జులై 10, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
- ●Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల



