త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget Laptops 2026 | రూ.40వేల లోపు ల‌భిస్తున్న‌ బెస్ట్ బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్‌..

Budget Laptops 2026 | ఒకప్పుడు రూ.40వేల‌ లోపు ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు ప్రధానంగా విద్యార్థుల అవసరాలకు మాత్రమే సరిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధిక సామర్థ్యం కలిగిన ప్రాసెసర్లు, వేగవంతమైన ర్యామ్, మెరుగైన స్టోరేజ్ సదుపాయాల వల్ల ఈ ధర పరిధిలో కూడా మంచి పనితీరు అందించే ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

S

Technology | Published On Jun 20, 2026, 11.47 am IST

Budget Laptops 2026 | రూ.40వేల లోపు ల‌భిస్తున్న‌ బెస్ట్ బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. స్టూడెంట్స్, ఉద్యోగులకు టాప్ ఛాయిస్‌..
Advertisement

Budget Laptops 2026 | ఒకప్పుడు రూ.40వేల‌ లోపు ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు ప్రధానంగా విద్యార్థుల అవసరాలకు మాత్రమే సరిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధిక సామర్థ్యం కలిగిన ప్రాసెసర్లు, వేగవంతమైన ర్యామ్, మెరుగైన స్టోరేజ్ సదుపాయాల వల్ల ఈ ధర పరిధిలో కూడా మంచి పనితీరు అందించే ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు, సాధారణ వినియోగదారులు తమ రోజువారీ కంప్యూటింగ్ అవసరాలను సులభంగా తీర్చుకునే మోడళ్లను ఎంచుకోవచ్చు. బడ్జెట్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే సమయంలో కేవలం ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లను చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. కొన్ని కంపెనీలు ఒక విభాగంలో మంచి ఫీచర్లు ఇచ్చినా, ఇతర ముఖ్యమైన అంశాల్లో రాజీ పడతాయి. అందుకే రూ.40వేల‌ లోపు ధ‌ర క‌లిగిన ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే తప్పనిసరిగా పరిశీలించాల్సిన కొన్ని ఫీచ‌ర్లు ఉంటాయి. వాటి గురించి టెక్ నిపుణులు వివ‌రిస్తున్నారు.

ప్రైమ్ బుక్ ప్రో..

ప్రైమ్‌బుక్ ప్రో ప్రత్యేకంగా విద్యార్థులు, ఆన్‌లైన్ లెర్నింగ్, రోజువారీ ప్రొడక్టివిటీ పనుల కోసం రూపుదిద్దుకుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ప్రైమ్ ఓఎస్‌పై పనిచేసే హైబ్రిడ్ ల్యాప్‌టాప్. అవసరమైతే క్లౌడ్ ద్వారా విండోస్ 11ను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ అందించారు. కంటెంట్ స్ట్రీమింగ్, నోట్స్ తీసుకోవడం, సాధారణ గేమింగ్ వంటి పనులకు ఇది అనుకూలంగా ఉంటుంది. 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 14 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకత. అయితే బ‌డ్జెట్ ల్యాప్‌టాప్‌ల‌లో 4జీబీ ర్యామ్ ఉన్న‌వి తీసుకుంటే ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక క‌నీసం 8జీబీ ర్యామ్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి.

ప్రైమ్ బుక్ మ్యాక్స్‌..

ప్రైమ్‌బుక్ మ్యాక్స్ వేరియెంట్ ప్రో మోడల్‌కు పెద్ద డిస్‌ప్లేతో వచ్చిన వెర్షన్. ఇందులో 15.6 ఇంచుల స్క్రీన్ ఉండటం వల్ల సంపూర్ణ ల్యాప్‌టాప్ అనుభూతిని కోరుకునే వారికి బాగా సరిపోతుంది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్‌తో బ్రౌజింగ్, వీడియో కాల్స్, ప్రొడక్టివిటీ యాప్స్, ఆండ్రాయిడ్ ఆధారిత పనులను సాఫీగా నిర్వహిస్తుంది. పెద్ద స్క్రీన్ ఉన్నప్పటికీ తక్కువ బరువు, మంచి బ్యాటరీ లైఫ్ కారణంగా విద్యార్థులు, రిమోట్ ఉద్యోగులకు ఇది మంచి ఆప్ష‌న్‌ గా నిలుస్తుంది.

ఆసుస్ క్రోమ్‌బుక్ సీఎక్స్‌1405..

ఆసుస్‌కు చెందిన క్రోమ్‌బుక్ సీఎక్స్‌1405 (2026) మోడ‌ల్ క్రోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంటెల్ ఎన్50 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో వస్తుంది. వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ పనులు, మీడియా స్ట్రీమింగ్ వంటి అవసరాలకు ఇది అనువైన ఎంపికగా నిలుస్తుంది. 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. క్రోమ్ ఓఎస్ వేగవంతమైన బూట్ టైమ్, ఆటోమేటిక్ అప్‌డేట్లు, మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. కేవలం 1.39 కిలోల బరువుతో ఉండటం వల్ల తరచూ ప్రయాణించే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

హెచ్‌పీ 15 ఏఎండీ అథ్లాన్ 7120యూ..

హెచ్‌పీ 15 ఏఎండీ అథ్లాన్ 7120యూ (2026) మోడ‌ల్ ల్యాప్ టాప్ ఆఫీస్ పనులు, రోజువారీ కంప్యూటింగ్ అవసరాల కోసం ప‌నిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎండీ అథ్లాన్ 7120యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్5 ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఉన్నాయి. పాత బడ్జెట్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే వేగవంతమైన రెస్పాన్స్‌ను అందిస్తుంది. 15.6 ఇంచుల డిస్‌ప్లే స్ప్రెడ్‌షీట్లు, డాక్యుమెంట్లపై ఎక్కువసేపు పనిచేసేందుకు అనుకూలంగా ఉంటుంది. 1.5 కిలోల బరువు మాత్రమే ఉండటం వల్ల సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రత్యేక కోపైలట్ కీ, డీడీఆర్5 మెమరీ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఏస‌ర్ స్మార్ట్ చాయిస్ ఆస్ప‌యిర్ వ‌న్ఎ114-45..

ఏస‌ర్ స్మార్ట్ చాయిస్ ఆస్ప‌యిర్ వ‌న్ఎ114-45 మోడ‌ల్‌ విండోస్ ఆధారిత బడ్జెట్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపికగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ అందించారు. వెబ్ బ్రౌజింగ్, ఆఫీస్ యాప్స్, ఆన్‌లైన్ లెర్నింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులను సాఫీగా నిర్వహిస్తుంది. 14 ఇంచుల డిస్‌ప్లే కారణంగా ఇది కాంపాక్ట్‌గా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2024, మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు. 1.3 కిలోల బరువుతో ఇది అత్యంత పోర్టబుల్ మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇవ‌న్నీ రూ.40వేల లోపు ధ‌ర‌కే అందుబాటులో ఉండ‌గా, 8జీబీ ర్యామ్ ను క‌లిగి ఉంటాయి.

సాధార‌ణంగా చాలా మంది బ‌డ్జెట్ ల్యాప్ టాప్ అన‌గానే 4జీబీ ర్యామ్‌నే ఎంచుకుంటారు. కానీ ఇది మ‌ల్టీ టాస్కింగ్‌కు స‌రిపోదు. క‌నీసం 8జీబీ ర్యామ్ ఉంటే రెండు మూడు అప్లికేష‌న్ల‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ర‌న్ చేయ‌వ‌చ్చు. అలాగే క‌నీసం 128జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉంటే మంచిది. దీని వ‌ల్ల ఎక్కువ అప్లికేష‌న్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసి ర‌న్ చేసుకోవ‌చ్చు. అయితే బ‌డ్జెట్ ల్యాప్‌టాప్ అనగానే త‌క్కువ కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన మోడ‌ల్స్‌ను ఎంచుకోవ‌ద్దు. స్పెసిఫికేష‌న్ల‌ను త‌ప్పనిస‌రిగా చెక్ చేశాకే ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేయ‌డం మంచిది.

Advertisement
Advertisement