Florida | 19 ఏళ్ల పైలట్ సాహనం.. రద్దీ రోడ్డుపై విమానం ల్యాండ్ చేసి..
Florida | అమెరికాలోని ఫ్లోరిడా (Florida)లో 19 ఏళ్ల యువ పైలట్ సాహసం చేశాడు. తాను నడుపుతున్న చిన్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని రద్దీ రహదారిపై సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
International | Published On Mar 11, 2026, 3.36 pm IST
Florida | అమెరికాలోని ఫ్లోరిడా (Florida)లో 19 ఏళ్ల యువ పైలట్ సాహసం చేశాడు. తాను నడుపుతున్న చిన్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని రద్దీ రహదారిపై సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ యువకుడి సాహసం చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
జుపిటర్ (Jupiter) నగరంలోని ఇండియన్ టౌన్ రోడ్డు (Indiantown Road)లో మార్చి 6న జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల నికో బ్రే (Niko Bray) తన స్నేహితుడితో కలిసి సెన్నా 150G (Cessna 150G) విమానంలో ఉత్తర పామ్‌బీచ్ కౌంటీ ప్రాంతాన్ని చూసేందుకు విహంగానికి వెళ్లాడు. అయితే, ఊహించని విధంగా వారు ప్రయాణిస్తున్న చిన్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పరిస్థితిని అంచనా వేసిన నికో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని భావించాడు. అయితే, ఆ సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ ఉంది. ముందుగా ఏ1ఏ రోడ్డులో ల్యాండ్ చేయాలని భావించగా.. ఆ మార్గం చాలా ఇరుకుగా ఉండటంతో సాధ్యం కాదని భావించాడు. చివరికి ఇండియన్‌టౌన్ రోడ్డులో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
ఆ సమయంలో ఇండియన్‌టౌన్ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయినా, ఎలాంటి భయం లేకుండా ఎంతో సాహసం చేసి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. విమానం రోడ్డుపై దిగుతుండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు షాక్ అయ్యారు. ఆ దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు యువ పైలట్ సాహసాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. నికో బ్రేకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే పైలట్ అవ్వాలనే కోరిక పుట్టింది. తన తల్లి సాయంతో చిన్న వయసులోనే పైలట్ అయ్యాడు. అతడు 2025లో పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.
https://x.com/janinelhook/status/2031550424826675310
https://x.com/JakeCan72/status/2031500329481810142
Also Read..
ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
వంటగదుల్లో ఇరాన్ మంటలు.. పెరుగుతున్న కట్టెలపొయ్యిల వినియోగం
భారత్‌లో లాంచ్ అయిన షియోమీ 17 స్మార్ట్ ఫోన్.. పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీ..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





