త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arun Sai Reddy | అమెరికాలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ విద్యార్థి మృతి..

Arun Sai Reddy | ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అకాల మ‌ర‌ణం చెందాడు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన 26 ఏండ్ల‌ అరుణ్‌ సాయి రెడ్డి బొల్లెందుల (Arun Sai Reddy) అనారోగ్యంతో జూన్ 19న‌ మృతిచెందాడు.

G

Telangana | Published On Jun 22, 2026, 10.01 am IST

Arun Sai Reddy | అమెరికాలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ విద్యార్థి మృతి..
Advertisement

Arun Sai Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అకాల మ‌ర‌ణం చెందాడు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన 26 ఏండ్ల‌ అరుణ్‌ సాయి రెడ్డి బొల్లెందుల (Arun Sai Reddy) అనారోగ్యంతో చ‌నిపోయాడు. ఫ్లోరిడాలోని (Florida) టెంపాలో నివసిస్తోన్న అరుణ్‌.. చ‌దువు పూర్తికావ‌డంతో STEM OPT (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)లో ఉన్నాడు. ఫుల్‌ టైమ్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో జూన్‌ 19న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో స్నేహితులు అత‌డిని ద‌వాఖాన‌కు తరలించారు. వైద్యులు అ్య‌వ‌స‌ర చికిత్స అందించిన‌ప్ప‌టికీ ప్రాణాలు కోల్పోయాడు. అరుణ్‌ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్ర‌వాస తెలుగు సంఘాల స‌హ‌కారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

 

Advertisement
Advertisement