Gajakesari Yogam | పవర్‌ఫుల్ గజకేసరి యోగం.. ఈ మూడురాశుల వారి జాతకాలే మారబోతున్నయ్..!
Gajakesari Yogam | గజకేసరి యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదమైంది. ఇందులో జన్మించిన వారికి సంపద, విజయం, శ్రేయస్సు, జ్ఞానం కలుగుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం ఫిబ్రవరిలోనే ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారికి అద్భుత సమయంగా నిలువనున్నది.
Gajakesari Yogam | గజకేసరి యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా శుభప్రదమైంది. ఇందులో జన్మించిన వారికి సంపద, విజయం, శ్రేయస్సు, జ్ఞానం కలుగుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం ఫిబ్రవరిలోనే ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులవారికి అద్భుత సమయంగా నిలువనున్నది. మనస్సుకు కారకుడైన చంద్రుడు ఫిబ్రవరి 26 న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి సైతం ఇదే రాశిలో ఉన్నాడు. ఫలితంగా బృహస్పతి, చంద్రుల మధ్య సంయోగం ఏర్పడుతుంది. దాంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు దాదాపు రెండున్నర రోజుల్లో మళ్లీ సంచారం చేయనున్నాడు. ఈ కాలం కొంతమంది వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆ అదృష్ట జాతకులెవరో చూద్దాం..!
మిథునరాశి
మిథునరాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో మీరు పెట్టుబడి నుంచి లాభాలను పొందుతారు. సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత బలంగా ఉంటుంది. వ్యాపారంగంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం, లేదంటే జీతం పెరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్యారాశి..
ఈ సమయం కన్య రాశి వారికి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పనిచేసే చోట మీరు కొత్త బాధ్యతలను స్వీకరించే ఛాన్స్ ఉంది. దాంతో భవిష్యత్‌లో గొప్ప విజయానికి ఆధారంగా నిలుస్తుంది. ఈ రాశి వారికి ఇతరులతో మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ఫలితంగా అవి మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక విజయాలను అందుకుంటారు. మీ ప్రతిభను అందరూ ప్రశంసిస్తారు. మీ విశ్వాసం పెరుగుతుంది.
మీనరాశి
మీన రాశి వారి కెరీర్‌కు సంబంధించి అన్నీ సానుకూల సంకేతాలు గోచరిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు మళ్లీ మీ చేతికి అందుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే ఛాన్స్ ఉంది. కెరీర్‌లో పురోగతికి సాధించేందుకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. పురోగతి, శ్రేయస్సు మీ సొంతమవుతాయి. ఏదైనా కొత్త ప్రణాళికలు వేస్తుంటే ఆర్థికంగా కూడా ప్రయోజనం కలుగుతుంది. స్నేహితులు, సామాజిక వర్గాల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య






