త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మ‌ర‌ణం

Plane Crash | అమెరికాలోని ఫోరిడాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. దక్షిణ ఫ్లోరిడాలోని ఓ నివాస ప్రాంతంలో బిజినెస్‌ జెట్ (business jet) కుప్పకూలింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ తొమ్మిది మంది దుర్మరణం చెందారు.

G

International | Published On Nov 2, 2026, 8.16 am IST

Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Plane Crash | త్రినేత్ర న్యూస్‌: అమెరికాలోని ఫోరిడాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. దక్షిణ ఫ్లోరిడాలోని ఓ నివాస ప్రాంతంలో బిజినెస్‌ జెట్ (business jet) కుప్పకూలింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ తొమ్మిది మంది దుర్మరణం చెందారు. టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆకాశం నుంచి నిలువునా కిందకు దూసుకొచ్చిన విమానం మిలిటరీ ట్రైల్, టెన్త్ అవెన్యూ నార్త్ ప్రాంతంలో ఉండే రోడ్డుపై పడి పేలిపోయింది. భారీ పేలుడుతో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ర‌హ‌దారిపై పెద్ద గుంట‌ ఏర్ప‌డ‌గా, చుట్టుప‌క్క‌ల ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ క‌మ్ముకుంది. దీంతో ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. విమానం కూలిన ప్రాంతానికి 14 కిలోమీట‌ర్ల దూరంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రిసార్ట్ `మార్‌-ఎ-లాగో` ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌మాదానికి ముందు విమానం సుమారు 35000 అడుగుల ఎత్తులో తూర్పుదిశ‌గా ప్ర‌యాణిస్తున్న‌ది. ఆ స‌మ‌యంలో పైల‌ట్లు తీవ్ర గాలివాన‌, మంచు పేరుకుపోవ‌డం, వ‌ర్ష‌పాతం వంటి స‌మ‌స్య‌లు ఎదురైన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో విమానాన్ని మ‌రో 2 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు అనుమ‌తి కోరిన‌ట్లు స‌మాచారం. అయితే కొద్దిసేప‌టికే విమానం కూలిపోయింది. టెక్సాస్‌లోని (Texas) ఆస్టిన్‌-బెర్గ్‌స్ట్రోమ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌హ‌మాస్‌కు (Bahamas) వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌న‌కు గల కారణాలపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్యాగ్స్:

BahamasBusiness JetFloridaMassive FireballPlane CrashSouth FloridaTexasUnited States
Advertisement
Advertisement