త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India Express Plane | ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్‌.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

Air India Express Plane | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి (Air India Express Plane) పెను ప్ర‌మాదం త‌ప్పింది. హైద‌రాబాద్ నుంచి థాయ్‌లాండ్ (Thailand) పుకెట్ (Phuket)కు బ‌య‌ల్దేరి వెళ్లిన విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది.

D

National | Published On Mar 11, 2026, 2.02 pm IST

Air India Express Plane | ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్‌.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
Advertisement

Air India Express Plane | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి (Air India Express Plane) పెను ప్ర‌మాదం త‌ప్పింది. హైద‌రాబాద్ నుంచి థాయ్‌లాండ్ (Thailand) పుకెట్ (Phuket)కు బ‌య‌ల్దేరి వెళ్లిన విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తింది. ల్యాండింగ్ స‌మ‌యంలో లోపాన్ని గుర్తించిన పైల‌ట్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అనంత‌రం అక్క‌డ విమానం హార్డ్ ల్యాండింగ్ (hard landing) అయ్యింది. ఈ క్ర‌మంలో నోస్ వీల్ డ్యామేజ్ (Nose Wheel Damaged) అయ్యింది.

ఫ్లైట్‌రాడార్24 (flightradar24.com) వెబ్‌సైట్ ప్రకారం.. Boeing 737 MAX 8 IX 938 విమానం బుధ‌వారం ఉద‌యం 6:42 గంటలకు హైదరాబాద్ నుంచి టేకాఫ్ అయ్యింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:40 గంటలకు థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. అయితే, ల్యాండింగ్ స‌మ‌యంలో విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో పైల‌ట్లు వెంట‌నే ఎయిర్‌పోర్టు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అల‌ర్ట్ అయిన అధికారులు అగ్నిమాపక యంత్రాలను, డాక్టర్లు, ఇతర సిబ్బందిని పుకెట్ విమానాశ్రయ అధికారులు సిద్ధం చేశారు.

ఇక విమానాన్ని పైల‌ట్లు ఎంతో జాగ్ర‌త్త‌గా ల్యాండ్ చేశారు. ఆ స‌మ‌యంలో విమానం హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. ఫ‌లితంగా నోస్ వీల్ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. వెనుక టైర్ కూడా బ్లాస్ట్ అయింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ విమానంలోని ప్ర‌యాణికులు, సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. పెను ప్ర‌మాదం త‌ప్ప‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 133 మంది ప్ర‌యాణికులు, సిబ్బంది ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. వారంతా సుర‌క్షితంగానే ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఇక ఈ నోస్ వీల్ ల్యాండింగ్ స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

Also Read..

కేర‌ళ ఎట్ట‌కేల‌కు కేర‌ళంగా మారింది : ప్ర‌ధాని మోదీ

వంట‌గ‌దుల్లో ఇరాన్ మంట‌లు.. పెరుగుతున్న‌ క‌ట్టెల‌పొయ్యిల వినియోగం

తెలంగాణ నూత‌న గ‌వర్న‌ర్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన శివ ప్ర‌తాప్ శుక్లా

Advertisement
Advertisement