Bangladesh | బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. యూనస్ ఇంటికి నిప్పు
Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) మరోసారి రాజకీయ హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా అవామీలీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
International | Published On Nov 19, 2026, 1.04 pm IST
Bangladesh | త్రినేత్ర న్యూస్ : దవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి తిరిగిరానున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో (Bangladesh) మరోసారి రాజకీయ హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా అవామీలీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు.
చట్టోగ్రామ్‌లోని పాంచ్‌లైస్ ప్రాంతంలో ఉన్న యూనస్ పూర్వీకుల ఇంటికి బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో నిప్పంటించారు. అదే సమయంలో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ గదికి నిప్పంటించారని, పై అంతస్తుల్లో నివసిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు, యూనస్ స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు (Grameen Bank Fire Bangladesh).
రెండేళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా.. ఈ డిసెంబర్‌లో తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆమె చేసిన పాస్‌పోర్ట్ అభ్యర్థనను ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో నిషేధిత అవామీ లీగ్ (Awami League) పార్టీ దేశవ్యాప్త నిరసనలు, లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. వేలాది మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢాకా సహా అన్ని జిల్లాల్లో బాంబు పేలుళ్లు, వాహనాల దహనం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రధాని తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా పారామిలటరీ దళాలను మోహరించింది. కేవలం 24 గంటల్లోనే వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది.. జీటీఏ 6 లాంఛ్ వేళ ప్రధాని ఆసక్తికర పోస్ట్
పెట్టుబడిదారులకు అలర్ట్.. మళ్లీ భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం.. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అవసరమా?: ప్రొఫెసర్ శాంత సిన్హా
సంబంధిత వార్తలు

Sheikh Hasina | హసీనా స్వదేశానికి వెళ్లేందుకు భారత్ ఓకే.. బంగ్లా ప్రభుత్వానికి కొన్ని షరతులు
నవంబర్ 14, 2026

Sheikh Hasina | స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న షేక్ హసీనా.. కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు
నవంబర్ 9, 2026

Ramchander Rao | భారత్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారా..?
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
- ●Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?
- ●Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
- ●Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్
- ●EPFO | పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇక 2 నెలల్లోనే నగదు..
- ●Cauvery water | కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..

Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్



