Shantha Sinha | తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం.. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అవసరమా?: ప్రొఫెసర్ శాంత సిన్హా
Shantha Sinha | తెలంగాణపై ఎల్ నినో (El Nino) ప్రభావం అధికంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిచడం ఎందుకని విశ్రాంత ప్రొఫెసర్ శాంత సిన్హా (Shantha Sinha) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు.
Shantha Sinha | త్రినేత్ర న్యూస్: తెలంగాణపై ఎల్ నినో (El Nino) ప్రభావం అధికంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిచడం ఎందుకని విశ్రాంత ప్రొఫెసర్ శాంత సిన్హా (Shantha Sinha) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు. పెట్టుబడులకు తాము వ్యతిరకం కాదని.. పెట్టుబడులు రావాలని, ఉపాధి పెరగాలన్నారు. కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. సమావేశానికి వచ్చే అతిథులకు ఫైవ్ స్టార్ హోటళ్లు, కరెంట్, నీళ్లు వృథా అని వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో ఈ ఆడంభరాలు ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు నీళ్ళకు ఇబ్బందులు పడుతున్నారని, అవి పట్టించుకోకుండా గ్లోబల్ సమ్మిట్ ఎందుకన్నారు. దీన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. అతిథులను పిలిచిన తర్వాత వాయిదా వేయడం కుదరదు.. ఎందుకు ఈ లేఖలు అని ప్రభుత్వం చెబుతున్నదని, సమ్మిట్‌కు మరో 20 రోజుల సమయం ఉందని చెప్పారు. అతిథులకు ఈ విషయం మెసేజ్‌తో చెప్పొచ్చని హితవు పలికారు. ప్రభుత్వం ఆ ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!

Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం





