Coal Mine Blast | బొగ్గు గనిలో భారీ పేలుడు.. 34 మంది మృతి
Coal Mine Blast | పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan province)లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు (Coal Mine Blast) సంభవించింది.
International | Published On Jul 31, 2026, 12.34 pm IST
Coal Mine Blast | త్రినేత్ర.న్యూస్ : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan province)లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు (Coal Mine Blast) సంభవించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అందులో చిక్కుకుపోయారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బలూచ్ రాజధాని క్వెట్టా (Quetta) సమీపంలోని ఒక గనిలో గురువారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో గనిలో 36 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ 34 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి సమీపంలోని మరో రెండు బొగ్గు గనులు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గనిలో మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
బెదిరింపులతో జెన్ జీ నోరు నొక్కేయలేరు.. మోదీ, షాపై రాహుల్ విమర్శలు
ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు
కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?
సంబంధిత వార్తలు

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026

Blast Near Mosque | మసీదులో భారీ పేలుడు.. 15 మంది మృతి
సెప్టెంబర్ 18, 2026

UNSC | 9/11 సూత్రధారులు గుహల్లో దాక్కోలేదు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను మరోసారి ఎండగట్టిన భారత్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి
- ●Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...
- ●Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం
- ●KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...

Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం

KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ



