త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మ‌ణ్ బాట భావిత‌రాల‌కు నిరంత‌ర స్ఫూర్తి

TGSRTC Bus Bhavan | తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చేసీన త్యాగాలు, చూపిన బాట భావిత‌రాల‌కు నిరంత‌ర స్ఫూర్తినిస్తాయ‌ని టీజీఎస్ ఆర్‌టీసీ సంస్థ‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సీహెచ్. వెంకన్న బాపూజీ కొనియాడారు.

S

Telangana | Published On Sep 27, 2026, 3.23 pm IST

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మ‌ణ్ బాట భావిత‌రాల‌కు నిరంత‌ర స్ఫూర్తి
Advertisement
  • టీజీఎస్ ఆర్టీసీ బ‌స్ భ‌వ‌న్‌లో ఘ‌నంగా బాపూజీ జయంతి వేడుక‌లు

TGSRTC Bus Bhavan | త్రినేత్ర న్యూస్: తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చేసీన త్యాగాలు, చూపిన బాట భావిత‌రాల‌కు నిరంత‌ర స్ఫూర్తినిస్తాయ‌ని టీజీఎస్ ఆర్‌టీసీ సంస్థ‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సీహెచ్. వెంకన్న బాపూజీ కొనియాడారు. ఆదివారం బాపూజీ 111వ జయంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో ఆయ‌న చిత్ర‌పటానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఈడీ వెంక‌న్న ప్ర‌సంగించారు.

స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య పుష్ప (ఫైనాన్షియ‌ల్ అడ్వైజ‌ర్‌), కిర‌ణ్‌కుమార్ కాస‌ర్ల (సీనియ‌ర్ లా ఆఫీస‌ర్‌), శిరీష (డిప్యూటీ చీఫ్ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌), శ్రీ‌కృష్ణ (డిప్యూటీ చీఫ్ మెకానిక‌ల్ ఇంజినీర్) పాల్గొన్నారు.

Advertisement
Advertisement