Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్‌లే: ఎంపీ రాఘవ్ చద్దా
Raghav Chadha | టెలికాం వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించిందని బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. కేంద్రం తాజాగా టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026 ద్వారా కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
Raghav Chadha | త్రినేత్ర న్యూస్: టెలికాం వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించిందని బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. కేంద్రం తాజాగా టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026 ద్వారా కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దీంతో 28 రోజుల ప్లాన్‌ను కాస్త 30 రోజులకు పెంచినట్లు తెలిపారు. దీంతో ఏడాదిలో 13 నెలవారీ రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా 12 రీఛార్జ్‌లు చేసుకుంటే సరిపోతుందన్నారు. తాను పార్లమెంట్‌లో కొట్లాడిన సమస్యలపై ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
డేటా అవసరం లేని వినియోగదారుల కోసం వాయిస్, ఎస్‌ఎంఎస్-మాత్రమే ఉండే ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌తో ప్రధానంగా వాయిస్ కాల్స్ వినియోగించే వారికి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించనుంది.
టెలికాం కంపెనీల 28 రోజుల వ్యాలిడిటీ మాయాజాలంపై, రీఛార్జ్ ప్లాన్లలో పరిమితులు, సౌలభ్యం లేకపోవడంపై పలువురు వినియోగదారులు తన దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై గత మార్చి 11న పార్లమెంట్‌లో నేను ప్రస్తావించాను. వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, అందుబాటు ధరల్లో సేవలు కల్పించేలా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్ (TRAI)కు కృతజ్ఞతలు తెలుపుతున్నా అని చద్దా పేర్కొన్నారు.
Good news for Prepaid Mobile Users in India
The Govt just introduced Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026, consumers will now have:
• 30-day recharge plans, reducing the need for 13 monthly recharges to 12 in a year
• Voice and SMS-only plans… pic.twitter.com/mfWVfMWNqR— Raghav Chadha (@raghav_chadha) September 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్
సెప్టెంబర్ 27, 2026

INDIA | సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ
సెప్టెంబర్ 26, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి
- ●Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...
- ●Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం
- ●KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...

Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం

KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ



