త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ – ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న త‌ర్వాతి ప్లేస్‌లో…

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల ఓ కొత్త రికార్డును నెల‌కొల్పింది. మ‌రాఠీ పాపుల‌ర్ సాంగ్‌ను స‌ర‌దాగా పాడుతూ శ్రీలీల పెట్టిన ఓ పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియ‌న్ల లైక్స్ వ‌చ్చాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇండియ‌న్ సెలిబ్రిటీ పెట్టిన పోస్ట్‌ల‌లో హ‌య్యెస్ట్ లైక్స్ శ్రీలీల పోస్ట్‌కు వ‌చ్చాయి.

N

Entertainment | Published On Sep 27, 2026, 3.14 pm IST

Sreeleela |  ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ – ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న్న త‌ర్వాతి ప్లేస్‌లో…
Advertisement

Sreeleela |  ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కొత్త రికార్డును నెల‌కొల్పింది. ఆమె పెట్టిన ఓ పోస్ట్‌కు ఏకంగా 11 మిలియ‌న్ల‌కుపైగా లైక్స్ వ‌చ్చాయి. ఇండియ‌న్ యాక్ట‌ర్స్ ప‌రంగా హ‌య్యెస్ట్ లైక్స్ వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల‌లో ఒక‌టిగా శ్రీలీల పెట్టిన పోస్ట్ నిలిచింది.

మ‌రాఠీ పాపుల‌ర్ సాంగ్‌...

మేక‌ప్ రూమ్‌లో హెయిర్‌స్టైలిష్ట్ శ్రీలీల‌ను రెడీ చేస్తోండ‌గా...మ‌రాఠీ సూప‌ర్ హిట్ పాప్ సాంగ్ త‌మ్డీ చ‌మ్డీ ల‌క ల‌క ల‌క సాంగ్‌ను ఫ‌న్నీగా పాడుతూ ఈ పోస్ట్‌లో ధ‌మాకా బ్యూటీ క‌నిపించింది. శ్రీలీల పాట పాడిన తీరు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వెర‌ల్ అయ్యింది. 11.1 మిలియ‌న్ల లైక్స్ రాగా...36 వేల కామెంట్లు వ‌చ్చాయి. స‌ర‌దా పోస్ట్‌కు 258 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి.

ర‌ష్మిక మంద‌న్న‌...ద‌ళ‌ప‌తి విజ‌య్‌...

భార‌తీయ న‌టీన‌టులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుల్లో హ‌య్యెస్ట్ లైక్స్ వ‌చ్చిన టాప్ ఫోర్‌ పోస్ట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ర‌ష్మిక మంద‌న్న త‌న పెళ్లి ఫొటోల‌ను షేర్ చేసిన పోస్ట్‌కు 23 మిలియ‌న్ల లైక్స్ వ‌చ్చాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ అనౌన్స్ చేస్తూ పెట్టిన పోస్ట్‌కు 19 మిలియ‌న్ల లైక్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. కియారా అద్వానీ ఫ‌స్ట్ పెళ్లి ఫొటోను షేర్ చేసిన పోస్ట్ 16 మిలియ‌న్ల‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. అత్య‌ధిక లైక్ ప‌రంగా ఈ ముగ్గురి త‌ర్వాత స్థానంలో శ్రీలీల నిలిచింది.

శ్రీలీల క్రేజ్‌కు నిద‌ర్శ‌నం...

సింపుల్ పోస్ట్‌కు రికార్డ్ స్థాయిలో లైక్స్ రావ‌డం నెటిజ‌న్ల‌తో పాటు అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. శ్రీలీల క్రేజ్‌కు నిద‌ర్శ‌న‌మిద‌ని ఫ్యాన్స్ అంటోన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల‌కు ప‌ద‌హారు మిలియ‌న్ల‌కుపైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ క‌లిగిన సౌత్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. త‌న కొత్త సినిమాలు, ఫ్యాష‌న్స్‌, చ‌దువుతో పాటు వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విశేషాల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటుంది శ్రీలీల‌. ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకుపోతున్న సినిమాల ప‌రంగా మాత్రం శ్రీలీల‌కు ల‌క్ క‌లిసిరావ‌డం లేదు. టాలీవుడ్‌లో ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకుంది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ డిజాస్ట‌ర్ త‌ర్వాత తెలుగులో ఆఫ‌ర్ల‌కు దూర‌మైంది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌పై ఫోక‌స్ పెడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by SREELEELA (@sreeleela14)

Advertisement
Advertisement