Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్‌లో 97 కేసులు నమోదు చేశాం
Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మందుబాబులు మారడం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP - Admin) జీ నరేందర్ అన్నారు. సైబరాబాద్ వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 97 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆదివారం తెలిపారు.
Weekend Drunk and Drive Cases | త్రినేత్ర న్యూస్: నేరమని చెప్పినా మందుబాబులు మారడం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP - Admin) జీ నరేందర్ అన్నారు. సైబరాబాద్ వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 97 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆదివారం తెలిపారు. 76 ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 15 కార్లు, 1 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే 79 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 12 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 6 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చాం అని ఏడీసీపీ నరేందర్ తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
గత వారం (21-9-2026 to 26-9-2026)లో 89 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. ముగ్గురికి జరిమానా, జైలు శిక్ష, ఒకరికి జరిమానా, సోషల్ సర్వీస్, 85 మందికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా
- ●KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్
- ●Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ●KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్

Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?

Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా

KTR | వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతున్నయ్ : కేటీఆర్

Ranabaali | రణబాలి సినిమాపై డాక్యుమెంటరీ సిరీస్ - యూట్యూబ్లో ఫ్రీ స్ట్రీమింగ్




