Virat Kohli | మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే.. ఎక్స్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే. మైదానంలో మెరుపు షాట్లతో యువతను ఆకట్టుకునే కోహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త శిఖరాలకు చేరారు.
Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కింగే. మైదానంలో మెరుపు షాట్లతో యువతను ఆకట్టుకునే కోహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త శిఖరాలకు చేరారు. ఎక్స్‌లో ప్రముఖ అమెరికన్ మీడియా పర్సనాలిటీ కిమ్ కార్దాషియన్‌ను (Kim Kardashian) వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన 11వ వ్యక్తిగా (Most Followed Personality On X)రికార్డు సృష్టించాడు. కర్దాషియాన్ ఫాలోవర్ల సంఖ్య 69.7 మిలియన్లు కాగా, ప్రస్తుతం కోహ్లీ 69.9 మిలియన్ల ఫాలోవర్లతో ఆమె కంటే ముందంజలో ఉన్నారు.
తాజా నివేదికల ప్రకారం.. ఎక్స్‌లో బిలియనీర్ ఎలాన్ మస్క్ అత్యధిక ఫాలోవర్లతో ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 240 మిలియన్లుగా ఉంది. మస్క్ తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 119.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (111.7 మిలియన్లు), ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (110.6 మిలియన్లు) తర్వాతి స్థానాలో ఉన్నారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 106.9 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో నిలిచారు. ప్రముఖ సింగర్ రిహానా (97.6 మిలియన్లు), జస్టిన్ బీబర్ (90.9 మిలియన్లు), కేటీ పెర్రీ (87.6 మిలియన్ ఫాలోవర్స్), టేలర్ స్విఫ్ట్ (81.6 మిలియన్ ఫాలోవర్స్), లేడీ గాగా (73 మిలియన్ ఫాలోవర్స్‌తో) టాప్ టెన్‌లో నిలిచారు.
Also Read..
భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
జులై 5న నా పెళ్లి.. ప్రకటించిన ఆమిర్ ఖాన్
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్
- ●H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
- ●Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్
- ●OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!
- ●Tirumala | తిరుమల శ్రీవారికి విశేష అభిషేకం.. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!

Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్






