Secunderabad | బొల్లారంలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి హత్య.. సెక్యూరిటీ గార్డుపై అనుమానం
Secunderabad | సికింద్రాబాద్‌లోని (Secunderabad) బొల్లారం పరిధి కౌకూర్‌లో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన ఆరేండ్ల బాలిక హత్యకు గురైంది.
Secunderabad | త్రినేత్ర న్యూస్: సికింద్రాబాద్‌లోని (Secunderabad) బొల్లారం పరిధి కౌకూర్‌లో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కిడ్నాప్‌నకు గురైన ఆరేండ్ల బాలిక హత్యకు గురైంది. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన దుండగుడు సంపులో పడేశాడు. పాపను వాచ్‌మెన్ విక్రమ్ చంపి పడేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్టుమెంట్‌లో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చిన్నారి సెల్లార్‌లో ఆడుకుంటుండగా అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. సీసీ పుటేజీలో బాలిక వాచ్‌మెన్‌తో పాటు ఉండడాన్ని గుర్తించిన పోలీసులు.. ముఖ్యమైన ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. కాగా, నిందితుడు కుటుంబసభ్యులను డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో తాను ఎక్కడ దొరికిపోతాననే భయంతోనే చిన్నారిని అంతడు చంపినట్లు తెలుస్తున్నది. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు బీహారీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
- ●Sharan Navaratri | శైలపుత్రి.. శక్తి స్వరూపిణి..! పర్వత పుత్రికగా అమ్మవారి తొలి దర్శనం..!
- ●Chalo Jantar Mantar | వెనక్కి తగ్గేదే లే!.. మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు
- ●Riyadh Airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. పైలట్ సహా 12 మంది మృతి
- ●Medical Staff | ఖమ్మం DMHOలో 99 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●సిక్స్‌ప్యాక్ కోసం నీళ్లకు బ్రేక్!.. స్క్రీన్‌పై లుక్ కోసం శరీరానికి షాక్!
- ●Horoscope | అక్టోబర్ 11 రాశిఫలాలు.. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Sharan Navaratri | శైలపుత్రి.. శక్తి స్వరూపిణి..! పర్వత పుత్రికగా అమ్మవారి తొలి దర్శనం..!

Chalo Jantar Mantar | వెనక్కి తగ్గేదే లే!.. మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు

Riyadh Airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. పైలట్ సహా 12 మంది మృతి

Medical Staff | ఖమ్మం DMHOలో 99 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక






