Benjamin Netanyahu | ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు నిలిపేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
Benjamin Netanyahu | త్రినేత్ర.న్యూస్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ చమురు వ్యవస్థను ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారణంగా ఇరాన్ ఖతార్‌లోని (Qatar) ఎల్ఎన్‌జీ (LNG) ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగింది. దీంతో ప్లాంట్ భారీగా దెబ్బతినడంతో ఇంధన ధరలు పెరగడంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి.
International | Published On Mar 20, 2026, 6.50 am IST
Benjamin Netanyahu | త్రినేత్ర.న్యూస్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచ చమురు వ్యవస్థను ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారణంగా ఇరాన్ ఖతార్‌లోని (Qatar) ఎల్ఎన్‌జీ (LNG) ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగింది. దీంతో ప్లాంట్ భారీగా దెబ్బతినడంతో ఇంధన ధరలు పెరగడంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై (Iranian Gas Field) దాడులను నిలిపివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపి వేయమని ట్రంప్ కోరారని, దానిని మేము గౌరవిస్తున్నామని తెలిపారు. జెరూసలేంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి విషయంలో అమెరికాకు తాము ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే ఈ దాడికి ఖతర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
`ఇజ్రాయెల్, అమెరికా నిజమైన భాగస్వాములుని చెప్పారు. అమెరికా సహకారంతో చాలావరకు సాధించాం. ఇజ్రాయెల్ గతంలోకన్నా బలంగా ఉంది. పశ్చిమాసియాపై ఇరాన్ దాడి చేస్తున్నది. పశ్చిమాసియా, అమెరికా ఆస్తులపై దాడులు చేస్తున్నది. ప్రపంచం మొత్తాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కాపాడుతున్నాయి. యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ లాగలేదు. ట్రంప్ ఏం చేయాలో ఎవ్వరూ చెప్పలేదు. అమెరికా కోసం ట్రంఫ్ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ జీఎన్‌జీపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తుంది. యుద్ధం అనుకున్నదాని కన్నా చాలా త్వరగా ముగుస్తుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తాం. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్‌కు లేదు. ఇరాన్ క్షిపణులు, అణు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాం. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు నిరుపయోగంగా మారాయి. ఆ దేశ నౌకాదళం సముద్ర గర్భంలో కూరుకుపోయింది. ఇంకా చేయాల్సిన పని మిగిలి ఉంది. అది పూర్తిచేస్తాం. ఇరాన్, అణు, బాలిస్టిక్ క్షిపణుల ముప్పును పూర్తిగా తొలగిస్తాం. ఇరాన్ వైమానిక దాడుల నుంచి తప్పించుకునే స్థితికి చేరుకోకముందే నిర్మూలిస్తాం. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించుకునేందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తాం.` అని నెతన్యాహు చెప్పారు.
ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది. తాజాగా ఖతార్‌లోని ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై ఇరాన్ దాడులతో.. ఎల్ఎన్‌జీ ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు మూడు నుంచి ఐదేండ్లు పడుతుందని ఖతార్ ఎనర్జీ సీఈవో సాద్ అల్-కాబీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని అమెరికా వెల్లడించింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులు చేయకూడదని ఆదేశాన్ని కోరింది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశ అగ్ర నాయకులు వైమానిక దాడుల్లో మరణించారు. సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటిరవకు ఇరాన్‌లో 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ జరిపిన దాడులతో సుమారు 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులవగా, 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో 15 మంది మరణించగా, కనీసం 13 మంది అమెరికా సైనిక సిబ్బంది చనిపోయారు.
సంబంధిత వార్తలు

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
సెప్టెంబర్ 16, 2026

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 15, 2026

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు



