Traffic Restrictions | హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లారో ఇక అంతే!
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: ముస్లిం సోదరులు అత్యంత్ర భక్తి శ్రద్ధలతో ఆచరించే రంజాన్ (Ramadan) ఉపవాసాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) కావడంతో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: ముస్లిం సోదరులు అత్యంత్ర భక్తి శ్రద్ధలతో ఆచరించే రంజాన్ (Ramadan) ఉపవాసాలు ముగియనున్నాయి. పవిత్ర రంజాన్ పండుగను శనివారం జరుపోకున్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం (జుమాతుల్ విదా) కావడంతో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
చార్మినార్ జోన్‌లో..
- నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపుకు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలేజీ వైపునకు మళ్లిస్తారు. నాగులచింత, శాలిబండ వైపు నుంచి చార్మినార్ వైపునకు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ నుంచి హరీబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు.
- చౌక్ మైదాన్ నుంచి వచ్చే వాహనాలను కోట్ల అలీజా వైపునకు, మూసాబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లీ, ఫతేదర్వాజా వైపునకు, గుల్జార్‌హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఏత్‌బార్ చౌక్ వద్ద నుంచి మీరాలం మార్కెట్, బీబీ బజార్ వైపునకు మళ్లిస్తారు.
- షేర్‌ఏ కమాన్ నుంచి వచ్చే వాహనాలను ఘాన్సీ బజార్, హైకోర్టు వైపునకు, లక్కడ్‌కోట్ వైపు నుంచి వచ్చే వాహనాలను మీరాలం మార్కెట్ వైపుకు మళ్లిస్తారు.
సికింద్రాబాద్ జోన్‌లో..
- సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్‌ను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తారు. బాటా ఎక్స్‌రోడ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను మహంకాళి పోలీస్టేషన్ వద్ద నుంచి లాలా టెంపుల్ వైపునకు మళ్లిస్తారు.
వాహనదారులు తాజా సమాచారం కోసం ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 సంప్రదించవచ్చని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు






