త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Rides in Kotthagudem dist | మ‌హిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్‌.. ఏసీబీకి పట్టుబడిన ఇన్‌చార్జ్‌ హాస్టల్ వార్డెన్

ACB Rides in Kotthagudem dist | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హాస్ట‌ల్ వార్డెన్ ఏసీబీకి పట్టుబడ్డారు. చ‌ర్ల మండ‌లం స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్‌ హాస్టల్ వార్డెన్/రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్న‌ భూక్యా వాలుసింహను అధికారులు ప‌ట్టుకున్నారు.

S

Telangana | Published On Sep 18, 2026, 3.58 pm IST

ACB Rides in Kotthagudem dist | మ‌హిళా ఉద్యోగి నుంచి లంచం డిమాండ్‌.. ఏసీబీకి పట్టుబడిన ఇన్‌చార్జ్‌ హాస్టల్ వార్డెన్
Advertisement

ACB Rides in Kotthagudem dist | త్రినేత్ర‌.న్యూస్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హాస్ట‌ల్ వార్డెన్ శుక్ర‌వారం ఏసీబీకి పట్టుబడ్డారు. చ‌ర్ల మండ‌లం స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని ఎస్టీ బాలుర ఇన్‌చార్జ్‌ హాస్టల్ వార్డెన్/రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్న‌ భూక్యా వాలుసింహను అధికారులు ప‌ట్టుకున్నారు. ఓ మ‌హిళా ఉద్యోగి హాజ‌రు విష‌యంలో 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

గ‌త‌ ఆగస్టులో ఆరు రోజుల గైర్హాజరును అనధికారిక గైర్హాజరుగా నమోదు చేయకుండా, భవిష్యత్తులో ఆమె సర్వీసులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆమె జీతం బిల్లుల తయారీలో ఎలాంటి సమస్యలు కలిగించకుండా అధికారిక సహాయం చేసేందుకు భూక్యా వాలుసింహ‌ తొలుత రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్ర‌కారం మొత్తాన్ని రూ.14,000కు తగ్గించి తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. న‌గ‌దును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన‌ట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement