త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Most Polluted Cities | ప్రపంచంలోని అత్యంత క‌లుషిత‌మైన 50 నగరాల్లో 47 భారత్‌లోనే..!

Most Polluted Cities | ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల్లో (Most Polluted Cities) 47 నగరాలు భారతదేశంలోనే (India) ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన శ్రీ గంగానగర్ 671 AQIతో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా.. దేశ రాజ‌ధాని ఢిల్లీ 13వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌లోని లాహోర్, చైనాలోని హోటాన్, కాష్గర్ న‌గ‌రాలు కూడా ఇందులో ఉన్నాయి.

D

National | Published On Nov 10, 2026, 3.39 pm IST

Most Polluted Cities | ప్రపంచంలోని అత్యంత క‌లుషిత‌మైన 50 నగరాల్లో 47 భారత్‌లోనే..!
Advertisement

Most Polluted Cities | త్రినేత్ర న్యూస్ : భారత్‌లోని పలు నగరాల్లో కాలుష్యం విప‌రీతంగా పెరుగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నది. ఫలితంగా జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రపంచంలో వాయు కాలుష్యం (Most Polluted Cities) అత్యధికంగా ఉన్న 50 నగరాల జాబితాలో ఏకంగా 47 నగరాలు భారతదేశం (India) నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

AQI.in లైవ్ ఎయిర్ క్వాలిటీ ర్యాంకింగ్స్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల్లో 47 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi) 13వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌కు చెందిన శ్రీ గంగానగర్ (Sri Ganganagar) 671 AQIతో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. హర్యానాలోని హిసార్ (428), సిర్సాలు (400), భివానీ (395), ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ (381) టాప్ ఐదులో నిలిచాయి. పంజాబ్‌లోని బ‌టిండా (338), హర్యానాలోని రోహ్‌త‌క్ (328) ప్రమాదకరమైన గాలి నాణ్యతతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. శ్రీనగర్ 294 AQIతో ఎనిమిదో స్థానంలో నిలవగా, పాటియాలా (285) తొమ్మిదో స్థానంలో ఉంది.

నోయిడా (284), గురుగ్రామ్ (282), ఘజియాబాద్ (282), గ్రేటర్ నోయిడా (263), పానిపట్ (261), ఫరీదాబాద్ (239), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్ (235), ముజఫర్‌నగర్ (235), మీరట్ (233), మధుర (233), బులంద్‌షహర్ (227) క‌లుషిత న‌గ‌రాల జాబితాలో ఉన్నాయి. మొత్తంగా ఈ జాబితాలో 50 న‌గ‌రాల్లో 47 భార‌త న‌గ‌రాలు కాగా.. మిగ‌తా మూడు న‌గ‌రాల్లో పాకిస్థాన్‌లోని లాహోర్ ఒక‌టి, చైనాలోని హోటాన్, కాష్గర్ ఉన్నాయి. దీపావ‌ళి సీజ‌న్‌లో బాణాసంచా కాల్చ‌డం, వాహ‌నాల దుర్గారాలు, ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డం, పంట వ్య‌ర్థాల ద‌హ‌నం కార‌ణంగా ఉత్త‌రాధి రాష్ట్రాల్లోని న‌గ‌రాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్న‌ట్లు స‌ద‌రు నివేదిక సూచిస్తోంది.

Also Read..

టాటా ఐఫోన్ ఫ్యాక్టరీలో విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం

దీపావ‌ళి వేడుక‌ల‌తో చెత్త‌మ‌య‌మైన న్యూజెర్సీ రోడ్లు.. నెట్టింట విమ‌ర్శ‌లు

లాఠీ ప‌ట్టిన టాక్సిక్ హీరోయిన్ - ఫ‌స్ట్ టైమ్ పోలీస్ పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్‌

Advertisement
Advertisement