త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srikalahasti Incident | శ్రీకాళహస్తి ఆలయంలో పేలిన్ సిలిండ‌ర్‌.. ప‌రుగులు తీసిన భ‌క్తులు.. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే!

Srikalahasti Incident | ఏపీలోని తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి (Srikalahasti) ఆల‌యంలో గురువారం అగ్ని ప్ర‌మాదం (Fire Incident) చోటుచేసుకుంది.

S

Telangana | Published On Nov 12, 2026, 3.46 pm IST

Srikalahasti Incident | శ్రీకాళహస్తి ఆలయంలో పేలిన్ సిలిండ‌ర్‌.. ప‌రుగులు తీసిన భ‌క్తులు.. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే!
Advertisement

Srikalahasti Incident | త్రినేత్ర న్యూస్: ఏపీలోని తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి (Srikalahasti) ఆల‌యంలో గురువారం అగ్ని ప్ర‌మాదం (Fire Incident) చోటుచేసుకుంది. ఆల‌యంలోని ప్ర‌ధాన వంటశాల‌లో గ్యాస్ సిలిండ‌ర్ (Gas Cylinder) పేల‌డంతో భ‌క్తులు ఒక్క‌సారిగా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ప‌రిస‌ర ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన పొగ‌లు వ్యాపించాయి. ఎటువంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..

ఆలయంలోని దక్షిణ గోపురం పక్కన ప్రసాదాల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలింది. దీంతో పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు సైతం మంటలు వ్యాపించాయి. పేలుడు శబ్దంతో భయాందోళనకు గురైన భక్తులు, ప్రసాదాలు తయారు చేస్తున్నవారు సైతం బయటకు పరుగులు పెట్టారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆల‌య సిబ్బంది మంటలను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదం కారణంగా చుట్టూ మండపాల్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ వెంట‌నే ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రసాదాల తయారీని నిలిపివేసి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement