TMC | ఫుట్‌బాల్ Vs ఎన్వలప్.. తృణమూల్ కాంగ్రెస్‌కు కొత్త పేరు, గుర్తు
TMC | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆధ్వర్యంలోని టీఎంసీ (TMC) పార్టీకి ఎన్నికల సంఘం ఫుట్‌బాల్ (Football) గుర్తును కేటాయించింది.
TMC | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆధ్వర్యంలోని టీఎంసీ (TMC) పార్టీకి ఎన్నికల సంఘం ఫుట్‌బాల్ (Football) గుర్తును కేటాయించింది. అంతేకాదు, దీదీ వర్గానికి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (Mamata All India Trinamool Congress) పేరును ఖరారు చేసింది. అటు అరూప్ రాయ్, రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ వర్గానికి ఎన్వలప్ (Envelope) గుర్తును కేటాయించింది. ఈ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ (Democratic Trinamool Congress) అనే పేరును ఖరారు చేసింది. వచ్చే నెల 6న జగరనున్న నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల్లో కొత్త గుర్తులు, పేర్లతోనే ఈ రెండు వర్గాలూ పోటీకి దిగనున్నాయి.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీఎంసీలో విభేదాలు తలెత్తాయి. పార్టీ రెండుగా విడిపోయింది. ఓ వర్గానికి దీదీ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. అయితే, వచ్చే నెల 6న జగరనున్న నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల (Bengal bypolls) నేపథ్యంలో పార్టీ గుర్తు, పేరుపై వివాదం మొదలైంది. ఇరు వర్గాలు తామే అసలైన టీఎంసీ అని, పార్టీ గుర్తు తమకే చెందాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో ఇరు వర్గాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించకుండా గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
శుక్రవారం ఉదయం 11 గంటల గడువులోగా ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. దీంతో ఇరు వర్గాలూ ప్రత్యామ్నాయ పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి అందజేశాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు కొత్త పేర్లు, గుర్తులను కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టీఎంసీ పార్టీ పేరును, పార్టీ గుర్తు అయిన పూలు-గడ్డి గుర్తును తాత్కాలికంగా ఫ్రీజ్ చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రధాని మోదీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇచ్చిన అర్ధరాత్రి పుట్టినరోజు కానుక అంటూ ఎద్దేవా చేసింది.
Also Read..
పసిపిల్లల పోషకాహార ఉత్పత్తుల్లో నిబంధనల ఉల్లంఘన.. నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్
భయపడుకుంటూ రాకండి.. నేన్ ఇక్కడే ఉన్నా.. దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తా
ఐఫోన్ 18 ఫోన్ల కోసం భారత్‌లో భారీ క్రేజ్.. ఢిల్లీలో యాపిల్ ప్రేమికుల బారులు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | మొదట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు
సెప్టెంబర్ 18, 2026

Annapurna Yojana West Bengal Modi | మహిళల సంక్షేమానికి పెద్దపీట.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
సెప్టెంబర్ 17, 2026

Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్రెడ్డి
- ●TG Assembly | ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం
- ●TGPSC | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!
- ●John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్వెస్లీ డిమాండ్..
- ●Madhu Yaskhi | జీవో 118 బాధితులకు శాశ్వత పరిష్కారం.. మంత్రులతో మధుయాష్కి భేటీ
- ●TG Assembly | ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. 8 రోజులు.. 51 గంటల 52 నిమిషాలు నడిచిన సభ

Kishan Reddy | తెలంగాణకు 2 లక్షల ఇళ్లు.. పీఎంఏవై–జీ కింద కేంద్రం ఆమోదం: కిషన్రెడ్డి

TG Assembly | ఎల్నినోతో వర్షాభావ పరిస్థితులు.. కేంద్రం ఆదుకోవాలని శాసనసభలో ముసాయిదా తీర్మానం

TGPSC | నిరుద్యోగులకు గుడ్న్యూస్.. HMWSSBలో 130 మేనేజర్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..!

John Wesley | అన్యాక్రాంత ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి.. సీపీఐ(ఎం) జాన్వెస్లీ డిమాండ్..



