త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankar Goud | ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే.. శంక‌ర్ గౌడ్ మృతి ప‌ట్ల‌ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి విచారం

Shankar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC driver Shankar Goud) బలవన్మరణం పట్ల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) విచారం వ్య‌క్తం చేశారు.

D

Hyderabad | Published On Apr 24, 2026, 9.53 am IST

Shankar Goud | ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే.. శంక‌ర్ గౌడ్ మృతి ప‌ట్ల‌ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి విచారం
Advertisement

Shankar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC driver Shankar Goud) బలవన్మరణం పట్ల ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) విచారం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా శంక‌ర్ గౌడ్‌కు నివాళుల‌ర్పించారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.

అధికారంలోకి రాక‌ముందు అలవికాని హామీలు ఇచ్చి ఒక్క ఆర్టీసీ సోద‌రుల‌నే కాదు యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌నే అమ‌లు చేయాల‌ని కార్మికులు డిమాండ్ చేస్తున్నార‌ని తెలిపారు. హామీల విష‌యంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఇంకా ఎంత‌మందిని బ‌లి తీసుకుంటారు అంటూ నిల‌దీశారు.

శంక‌ర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తొంద‌రపాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌నిక సూచించారు. ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాద‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. న్యాయ‌ప‌రంగా పోరాటం చేద్దామ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు.

Also Read..

Ponnam Prabhakar | రాజ‌కీయ పార్టీలు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే ఇలాంటి ఘ‌ట‌న‌లు.. శంక‌ర్ గౌడ్ మృతిప‌ట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ దిగ్భ్రాంతి

శంక‌ర్‌ గౌడ్ ఆత్మబలిదానం.. మా హృద‌యాల‌ను క‌ల‌చివేసింది: హ‌రీశ్ రావు

ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్‌గౌడ్ మృతి.. సీఎం రేవంత్‌, బండి సంజయ్ దిగ్భ్రాంతి

Advertisement
Advertisement