Harish Rao | శంకర్ గౌడ్ ఆత్మబలిదానం.. మా హృదయాలను కలచివేసింది: హరీశ్ రావు
Harish Rao | ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao,) అన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao,) అన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని మనవి చేశారు. శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
ఎంత మందిని బలితీసుకుంటావ్?
`అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలి.
అపాయింటెడ్ డేగా ప్రకటించండి..
శంకర్ గౌడ్ అమరుడైన రోజును `అప్పాయింటెడ్ డే`గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి.కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేస్తున్నాం.` అని హరీశ్ రావు అన్నారు.
పొన్నం ప్రభాకర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతవహించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన బాధ్యత వహించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ఆయన కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం తర్వాత ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. శంకర్ గౌడ్ మరణించిన విషయాన్ని దాచి హడావుడిగా పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీని పోలీస్ ఎస్కార్ట్ మధ్య నర్సంపేట తరలించారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపై చర్చలంటూనే ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిస్కారమయ్యే వరకు వారికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





