Britney Spears | మద్యం సేవించి డ్రైవింగ్.. పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ అరెస్ట్
Britney Spears | అమెరికన్ పాప్ స్టార్ (American singer) బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) అరెస్టయ్యారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న (influence of alcohol) ఈ పాప్ స్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Entertainment | Published On Mar 6, 2026, 11.23 am IST
Britney Spears | అమెరికన్ పాప్ స్టార్ (American singer) బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) అరెస్టయ్యారు. బుధవారం రాత్రి దక్షిణ కాలిఫోర్నియాలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న (influence of alcohol) ఈ పాప్ స్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియా (California) హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో బ్రిట్నీ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా.. కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను ఆపి పరీక్షించారు. ఈ పరీక్షల్లో బ్రిట్నీ మద్యం సేవించినట్లు బయటపడింది. యూఎస్ చట్ట ప్రకారం మద్యం మత్తులో వాహనం నడపడం తీవ్రమైన నేరం కావడంతో అక్కడిక్కడే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమెను విడుదల చేశారు. మే 4న వెంచురా కౌంటీ సుపీరియర్ కోర్టులో ఆమె విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 2, 1981న మిస్సిస్సిప్పిలో జన్మించిన బ్రిట్నీ.. లూసియానాలో పెరిగారు. చిన్నతనంలోనే "ది ఆల్ న్యూ మిక్కీ మౌస్ క్లబ్" (The All New Mickey Mouse Club) వంటి టీవీ షోల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1998లో విడుదలైన ఆమె తొలి సింగిల్ బేబీ వన్ మోర్ టైమ్ (Baby One More Time) ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ సాంగ్ ఆమెకు రాత్రికి రాత్రే స్టార్ డమ్‌ను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత టాక్సిక్ (Toxic), ఎవ్రీటైమ్ (Everytime), గిమ్మీ మోర్ (Gimme More), ఉమనైజర్ (Womanizer), స్ట్రాంగర్ (Stronger) వంటి హిట్ పాటలతో స్పియర్స్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పాప్ స్టార్లలో ఒకరిగా నిలిచారు. ఆమెను ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆమె అరెస్ట్‌తో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
Also Read..
Donald Trump | ముందు ఇరాన్ పని ముగిస్తాం.. ఆ తర్వాత క్యూబా పనిపడతాం : ట్రంప్
Israel | ఖమేనీని హతమార్చాలని గత నవంబర్‌లోనే నిర్ణయించుకున్నాం : ఇజ్రాయెల్
Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవరకు అంతేనా..?
సంబంధిత వార్తలు

America | జీతం పెంచలేదని గోడౌన్‌కు నిప్పు పెట్టాడు.. యజమానికి 600 మిలియన్ డాలర్లు నష్టం..
ఏప్రిల్ 11, 2026

Viral Video | ఒక్క నిమిషంలో 16 కోట్ల విలువైన జ్యుయెలరీ ఎత్తుకెళ్లారు.. వీడియో చూస్తే మతిపోతుంది!
మార్చి 14, 2026

Old Tractor | అదృష్టాన్ని తెచ్చిపెట్టిన తుప్పుపట్టిన ట్రాక్టర్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు
ఫిబ్రవరి 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



