Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
Diwali Day | త్రినేత్ర.న్యూస్: భారతదేశంలో జరిగే అతిముఖ్యమైన పండుగల్లో దీపావళి (Diwali) ఒకటి. ఈ వెలుగుల పండుగ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికాలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
International | Published On Aug 22, 2026, 8.15 am IST
Diwali Day | త్రినేత్ర.న్యూస్: భారతదేశంలో జరిగే అతిముఖ్యమైన పండుగల్లో దీపావళి (Diwali) ఒకటి. ఈ వెలుగుల పండుగ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికాలోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దీపావళి పండుగను ప్రతిఒక్కరు జరుపుకోవాలంటూ కాలిఫోర్నియా అసెంబ్లీ (California Assembly) ఆ రాష్ట్ర ప్రజలను కోరింది. నవంబర్ 8ని దీపావళి దినోత్సవంగా (Diwali Day) గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. భారత సంతతికి చెందిన అసెంబ్లీ సభ్యులు దర్శన పటేల్ (Darshana Patel), యాష్ కల్రా (Ash Kalra) ఈ తీర్మానాన్ని ప్రవెట్టారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాతోపాటు (California) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ అమెరికన్లు, ప్రవాస భారతీయుల పట్ల తమకున్న గౌరవాన్ని అసెంబ్లీ చాటిచెప్పింది.

కాగా, 2025 చివరలో కాలిఫోర్నియా ప్రభుత్వం దీపావళిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. అయితే ప్రభుత్వ నిధులతో మతపరమైన పండుగలకు సెలవు ఇవ్వడంపై కొన్ని చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి ఇటీవల ఆ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తిస్థాయి ప్రభుత్వ సెలవుపై కోర్టులో వివాదం నడుస్తుండటంతో.. అసెంబ్లీ సభ్యులు దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త తీర్మానాన్ని (HR 137) ఆమోదించారు. అయితే ఈ తీర్మానం (Resolution) వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ఉండదు. కానీ, దీపావళి పండుగ ప్రాముఖ్యతను, భారతీయ సమాజ సంస్కృతిని కాలిఫోర్నియా రాష్ట్రం అధికారికంగా గౌరవించినట్లు అవుతుంది.
కాగా, గురువారం అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానంలో.. `ఈ ఏడాది నవంబర్ 8న (ఆదివారం) వచ్చే దీపావళి పండుగను అసెంబ్లీ గుర్తిస్తున్నది. ఈ వేడుకల్లో కాలిఫోర్నియా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నది` అని పేర్కొన్నారు. భారతీయ అమెరికన్లు, దక్షిణాసియా అమెరికన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న దీపావళి పండుగను అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు, సిక్కులు, బౌద్ధులు మరియు జైనులు ఏటా జరుపుకుంటారని తెలిపింది. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పండుగలలో ఒకటని, కుటుంబాలను, స్నేహితులు, సమాజాన్ని ఒకచోటకు చేర్చి.. ఉదారత, ఐక్యత, ఆనందం, కృతజ్ఞత, ఆత్మపరిశీలనను పంచుకునేలా చేస్తుందని తీర్మానం వివరించింది.

దీపావళిని సాధారణంగా వెలుగుల పండుగగా పిలుస్తారు. ఈ సమయంలో ఇళ్లను కొవ్వొత్తులు, నూనె దీపాలు, మట్టి ప్రమిదలతో అలంకరిస్తారు. మంచి ఆరోగ్యం, సంపద, జ్ఞానం, శాంతి, శ్రేయస్సు పట్ల గౌరవాన్ని చాటుతూ ఆకాశంలో బాణసంచా కాలుస్తారని పేర్కొంది. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతికూలతల నుంచి విముక్తి, కష్టాలను అధిగమించే ధైర్యం, సానుకూలత, వినయం, వ్యక్తిగత సవాళ్లు ఎదురైనప్పటికీ దయతో మెలగడం వంటి గొప్ప సందేశాలను ఈ పండుగ ఇస్తుందని తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు
- ●Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి
- ●బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!
- ●Horoscope | ఆగస్టు 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు!
- ●Oxford | తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి.. ఆక్స్ఫర్డ్కు సీఎం రేవంత్ ఆహ్వానం
- ●"ఎవరొచ్చినా ఆపేదే లేదు!" – వరంగల్లో కొండా ఫ్యామిలీ 'డబుల్ గేమ్' వెనుక అసలు స్కెచ్ ఇదే!

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు

Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి

బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!

Horoscope | ఆగస్టు 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు!






