త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన‌ గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య స‌ద‌స్సుకు ఆహ్వానం

KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌర‌వం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లో నిర్వహించనున్న TAL Health Fest-2026కు విశిష్ట అతిథిగా హాజ‌ర‌వ్వాల‌ని ఆహ్వానం అందింది.

S

Telangana | Published On Oct 4, 2026, 12.45 pm IST

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన‌ గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య స‌ద‌స్సుకు ఆహ్వానం
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌర‌వం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లో నిర్వహించనున్న TAL Health Fest-2026కు విశిష్ట అతిథిగా హాజ‌ర‌వ్వాల‌ని ఆహ్వానం అందింది. ఈమేర‌కు ఆదివారం టచ్‌-ఎ-లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో సాయి గుండవెల్లి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు.

ఈనెల‌ 30న యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగో (UC San Diego)లో జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భవిష్యత్‌ వైద్య విధానాలు, ఆవిష్కరణలపై సదస్సులో చర్చించనున్న‌ట్లు పేర్కొన్నారు. సదస్సులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), డిజిటల్‌ హెల్త్‌, పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌, మెడికల్‌ టూరిజం తదితర అంశాలపై అంతర్జాతీయ నిపుణులు చర్చిస్తార‌ని వివ‌రించారు.

వైద్యం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో వ‌స్తున్న మార్పులపై వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ఈ వేదిక‌లో పంచుకోనున్నారు. కేటీఆర్ సైతం సాంకేతికత వినియోగం, ఆవిష్కరణలు, డిజిటల్‌ హెల్త్‌ తదితర అంశాలపై తన ఆలోచనలను పంచుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కాగా తెలంగాణలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ గతంలో సాంకేతికత, ఆవిష్కరణలు, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో అందించిన నాయకత్వ పటిమ, సాధించిన ప్రగతిని గుర్తించి నిర్వాహకులు ఆయనకు ఈ గౌరవాన్ని కల్పించ‌డం విశేషం.

Advertisement
Advertisement