Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
Bandla Ganesh | నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)పై నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసభ్యపదజాలంతో ప్రకాశ్‌రాజ్‌పై విరుచుకుపడ్డారు.
Entertainment | Published On Jun 4, 2026, 12.59 pm IST
Bandla Ganesh | తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇస్తుందని ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటనపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్‌పై నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) తీవ్రంగా స్పందించారు. అసభ్యపదజాలంతో ప్రకాశ్‌రాజ్‌పై విరుచుకుపడ్డారు.
“నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం..? అసలు నువ్వెవడివి..? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా..? నీ ఊరు ఏది. నీ కథ ఏంటి..? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా..? ఎక్కడ చూసినా నువ్వే. ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!” అంటూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని… https://t.co/ELkBZtEUh8
— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2026
“రండి దొరా.. రండి..”
పవన్ పేరు ప్రస్తావించకుండా ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. “"రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా..? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదా సింగల్ గా వస్తున్నారా..? అది చెప్పి రండి” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనసైనికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ఎన్నికల ఓటములను ప్రస్తావిస్తూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ గతంలోనూ పవన్‌ను టార్గెట్ చేస్తూ #justasking అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Also Read..
పవన్ అక్కడే ఉండాలి.. ఎక్కడో ఉంటా అంటే ఎలా?: మండలి చైర్మన్ గుత్తా
చల్లని కబురు.. కేరళను తాకిన రుతుపవనాలు.. రాష్ట్రానికి ఐఎండీ భారీ వర్ష సూచన
టెంపుల్ సిటీ అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్
తాజావార్తలు
- ●Srinivas Goud | సీఎం రేవంత్ ఎడిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వస్తున్నడు: శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం..!
- ●TMC Crisis | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో పెను ప్రకంపనలు: బీజేపీ గూటికి 20 మంది టీఎంసీ ఎంపీలు?
- ●Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా - రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
- ●Rapido Driver | ర్యాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి.. డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు..
- ●S-400 Missiles | భారత్‌కు చేరిన ఎస్-400 నాలుగో యూనిట్.. ఇక మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Srinivas Goud | సీఎం రేవంత్ ఎడిపోయిన ప్రాజెక్టులు చూడ్డానికి వస్తున్నడు: శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం..!

TMC Crisis | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో పెను ప్రకంపనలు: బీజేపీ గూటికి 20 మంది టీఎంసీ ఎంపీలు?

Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా - రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ






