Tiruvannamalai | టెంపుల్ సిటీ అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్
Tiruvannamalai | టెంపుల్ సిటీ తిరువణ్ణమలై (అరుణాచలం)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో (Girivalam route) ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగింది.
Tiruvannamalai | నిత్యం శివనామస్మరణతో మార్మోగే టెంపుల్ సిటీ తిరువణ్ణమలై (అరుణాచలం)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో (Girivalam route) ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు ధర్మపుర ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన స్నేహితులతో కలిసి గతనెల పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణమలై (Arunchaleswarar temple) వెళ్లింది. గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని రాత్రి సమయంలో వారంతా ద్విచక్ర వాహనాల్లో ఇంటికి బయల్దేరారు. కాగా, మహిళ మరో వ్యక్తితో బైక్‌పై వెళ్తూ ఓ చోట వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో సమీప ప్రాంతం నుంచి వచ్చిన ఓ ముఠా వారిని బెదిరించి అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ సదరు మహిళపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళను, ఆ వ్యక్తిని నగ్నంగా నిలబెట్టి వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోని వివాహితకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు మహిళ నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు మొదలు పెట్టారు.
ఆ తర్వాత తిరువణ్ణమలై ప్రాంతానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతిపై కూడా అత్యాచార ఘటన కలకలం రేపింది. యువతి గిరి ప్రదక్షిణ చేస్తూ ఓ చోట విశ్రాంతి కోసం ఆగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన స్నేహితుడితో కలిసి సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లింది. అక్కడ టిఫిన్ పార్శిల్ తీసుకుని వెళ్తుండగా.. ఓ ముఠా మార్గం మధ్యలో వీరిని అడ్డగించింది. ఇద్దరినీ బలవంతంగా సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి.. అక్కడ యువతిపై సామూహిత అత్యాచారం చేశారు. వీరిద్దరినీ కూడా నగ్నంగా నిలబెట్టి వీడియో తీశారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుస ఘటనలతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి నిందితులకోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడిని తిరువణ్ణమలై సమీపంలోని అడైయూర్ గ్రామానికి చెందిన కె. వాసుదేవన్ (28)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే తిరువణ్ణమలై, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో దొంగతనం, చైన్ స్నాచింగ్ వంటి కేసులు నమోదయ్యాయి. మిగతా నిందితులు బి. ఆకాష్ (23), ఆర్. తమిళరసన్ (27), జి. అప్పు (24), ఎ. హరిహరన్ (27), వి. శర్మ (23), ఎన్. బాలాజీ (25), ఎస్. అరుణ్ కుమార్ (29)గా గుర్తించారు. మిగతా ముగ్గురి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, తమిళనాడులోని అరుణాచల పర్వత పాదాల చెంత ఉన్న ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్ని లింగ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. తమిళనాడు సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరువణ్ణమలై వస్తుంటారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తులు, స్థానికులు ఒంటరిగా వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
Also Read..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం
చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






