Chiranjeevi | మెగావెర్స్ ప్రోమో రిలీజ్ – నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి టాక్ షో – రానున్న గెస్ట్‌లు వీళ్లే….
ఓటీటీ కోసం మెగాస్టార్ చిరంజీవి ఓ సెలిబ్రిటీ టాక్ షో చేయబోతున్నారు. మెగావెర్స్ పేరుతో రూపొందుతోన్న ఈ టాక్ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మెగావెర్స్ ప్రోమో మంగళవారం రిలీజైంది. ఇందులో స్టైలిష్ లుక్‌లో చిరంజీవి కనిపించారు.
Entertainment | Published On Nov 24, 2026, 4.35 pm IST
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓ సెలిబ్రిటీ టాక్ షో చేయబోతున్నారు. ఈ షో టైటిల్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. మెగావెర్స్ పేరుతో రూపొందుతోన్న ఈ టాక్ షో దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎన్ లెటర్ మిస్సింగ్....
చిరంజీవి పేరుతో ఎన్ లెటర్ మిస్సయిన పోస్టర్లు, ఫ్లెక్సీలు సిటీలో అక్కడక్కడ కనిపించాయి. ఎన్ లెటర్ మిస్సింగ్‌పై మెగావెర్స్ టీజర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. ఎన్ లెటర్‌కు అర్థం నెట్‌ఫ్లిక్స్ అంటూ వెల్లడిస్తూ మెగావెర్స్ ప్రోమో రిలీజ్ చేసింది. వింటేజ్ చిరంజీవి పోస్టర్లు, కటౌట్లు చూపిస్తూ ఈ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. చివరలో స్టైలిష్ లుక్‌లో చిరంజీవి కనిపించారు.మెగా నోస్టాల్జియా ...మెగా ముచ్చట్లు... అన్ని ఒకే చోట అంటూ ఈ ప్రోమోకు క్యాప్షన్ జోడించింది.ఈ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
స్పెషల్ ఈవెంట్....
మెగావెర్స్ టాక్ షోకు సంబంధించి నవంబర్ 30న హైదరాబాద్‌లో ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 13 నుంచి టాక్ షో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మెగావెర్స్‌కు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు అగ్ర దర్శకులు గెస్ట్‌లుగా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జున, నాగచైతన్యతో పాటు అఖిల్ ఓ ఎపిసోడ్‌లో సందడిచేయబోతున్నట్లు సమాచారం. కమల్‌హాసన్, సూర్య, జ్యోతిక, కార్తీ, రవితేజ, నాని, బ్రహ్మానందం, సత్య, సునీల్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌తో పాటు పలువురు పేర్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్‌తో పాటు మిగిలిన మెగా హీరోలు ఓ ఎపిసోడ్‌లో గెస్ట్‌లుగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
N’ vacchesindi… MEGA collaboration kudiresindi! ❤️🔥
Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu! 💁🏻♂️
Anni oke chota! ✨MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE 🌟
Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix https://t.co/hqMrpdf8GM
— Netflix India South (@Netflix_INSouth) November 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thriller OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
నవంబర్ 24, 2026

Sobhita Dhulipala | లిప్‌లాక్‌తో నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెప్పిన శోభిత
నవంబర్ 23, 2026

Prabhas | డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రభాస్.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి మద్దతు కోరిన కిషన్‌రెడ్డి
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
- ●Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు
- ●Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- ●Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
- ●Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!

Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు

Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!



