త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood OTT | ఆరు వంద‌ల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌

అజ‌య్ దేవ్‌గ‌ణ్, ట‌బు, శ్రియా హీరోహీరోయిన్లుగా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేట‌ర్ల‌లో ఆరు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

N

Entertainment | Published On Nov 21, 2026, 5.42 pm IST

Bollywood OTT | ఆరు వంద‌ల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌
Advertisement

Bollywood OTT |  దృశ్యం 3 మూవీ ఈ ఏడాది హిందీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, ట‌బు, శ్రియా హీరోహీరోయిన్లుగా న‌టించారు. దృశ్యం, దృశ్యం 2 సినిమాల‌కు కొన‌సాగింపుగా తెర‌కెక్కిన ఈ సినిమాకు అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
థియేట‌ర్ల‌లో దృశ్యం 3 ఆరు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది హిందీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఓటీటీలోకి...

ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫైన‌ల్ అయ్యాయి. న‌వంబ‌ర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది.

కొత్త క‌థ‌తో...

మ‌ల‌యాళ దృశ్యం 3తో సంబంధం లేకుండా కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో ద‌ర్శ‌కుడు అభిషేక్ పాఠ‌క్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్, ట‌బు యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వ‌చ్చే మ‌లుపు సినిమాకు హైలైట్‌గా నిలిచిందంటూ కామెంట్లు వ‌చ్చాయి. మూడో పార్ట్‌తోనే దృశ్యం క‌థ‌ను ఎండ్ చేశారు. దృశ్యం 3లో ప్ర‌కాష్ రాజ్‌, జై దీప్ అహ్ల‌వ‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన దృశ్యం 3 డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌గా...బాలీవుడ్ మూవీ సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

ప‌గ‌తో...

త‌న కుటుంబంలో జ‌రిగిన విషాదాన్ని మ‌ర్చిపోయి కూతురు అంజు పెళ్లిప‌నుల్లో విజ‌య్ బిజీగా ఉన్నాడు. త‌న కొడుకు మ‌ర‌ణంపై ఐజీ మీరా ప‌గ‌తో ర‌గిలిపోతుంటుంది. మ‌ర్డ‌ర్ కేసులో విజ‌య్ ప్ర‌వేశ‌పెట్టిన‌వి అబ‌ద్ద‌పు సాక్ష్యాల‌ని నిరూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. మీరా వేసిన ఎత్తుల‌ను అజ‌య్ ఎలా తిప్పికొట్టాడు? త‌న కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement