Gutha Sukender Reddy | పవన్ అక్కడే ఉండాలి.. ఎక్కడో ఉంటా అంటే ఎలా?: మండలి చైర్మన్ గుత్తా
Gutha Sukender Reddy | ఈ భూగోళంలోనే అమరావతి లాంటి రాజధాని లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారని.. దానికి పవన్ కళ్యాణ్ వంతపాడుతున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులంతా అక్కడే నివాసం ఉండాలని గుత్తా చురకలంటించారు.
Gutha Sukender Reddy | త్రినేత్ర.న్యూస్: ఈ భూగోళంలోనే అమరావతి లాంటి రాజధాని లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారని.. దానికి పవన్ కళ్యాణ్ వంతపాడుతున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు ఏపీ నాయకులు అక్కడే ఉండాలని.. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులంతా అక్కడే నివాసం ఉండాలని గుత్తా చురకలంటించారు. నల్లగొండ జిల్లాలో గురువారం ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై గుత్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోజే రాజకీయ సభ ఎందుకు? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచించారు. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అమరావతిని బ్రహ్మాండంగా ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దానికి పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారు అని ఫైరయ్యారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు స్పందించి పవన్‌ను విమర్శిస్తున్నారు. తాజాగా మండలి చైర్మన్ గుత్తా కూడా తనదైన శైలిలో పవన్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!





