Monsoon | చల్లని కబురు.. కేరళను తాకిన రుతుపవనాలు.. రాష్ట్రానికి ఐఎండీ భారీ వర్ష సూచన
Monsoon | భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించినట్లు చెప్పింది. ఇవాళ కేరళ (Kerala)లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. నైరుతి రాకతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Monsoon | హీట్‌వేవ్స్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశ ప్రజలు, రైతాంగం ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించినట్లు చెప్పింది. ఇవాళ కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ (IMD) ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారికంగా వెల్లడించింది.
తొలుత మే 26 నాటికి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala)లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే 28, జూన్ 1, జూన్ 3కి అంచనా తేదీలు మారాయి. ఆ తర్వాత మే 4న రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. అన్నట్లుగానే నేడు కేరళను రుతుపవనాలు తాకాయి. ఇక కేరళ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజుల్లో ఇవి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి.
ఇక ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటలు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
పొంచి ఉన్న ‘ఎల్ నినో’ ముప్పు..
మరోవైపు ఈ ఏడాది రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ సాగే ఈ రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి ఎర్రర్ మార్జిన్ నాలుగు శాతంగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించింది. జూన్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు (Heatwaves) నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.
Also Read..
టెంపుల్ సిటీ అరుణాచలంలో దారుణం.. గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రేప్
చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






